భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయ్ చాను.. వెయిట్‌లిఫ్టింగ్‌లో తన జాతీయ రికార్డును మెరుగుపర్చుకుంది. కోల్‌కతా వేదికగా జరుగుతున్న జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా మంగళవారం మహిళల 49 కేజీల విభాగంలో పాల్గొందీ స్టార్ ప్లేయర్. స్నాచ్‌లో 88 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 115 కేజీలు ఎత్తిన మీరా (రైల్వేస్) .. మొత్తం మీద 203 కేజీలు లిఫ్ట్ చేసి తన పేరిటే ఉన్న జాతీయ రికార్డు (201) తిరగరాసింది.
![Indian Weightlifter Mirabai Chanu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kolkata_0402newsroom_1580822464_1003.jpg)
ప్రియదర్శినికి స్వర్ణం..
ఇదే క్రీడల్లో తెలంగాణ అమ్మాయి ప్రియదర్శిని 49 కేజీల విభాగంలో ఒక స్వర్ణం, కాంస్యంతో సత్తాచాటింది. స్నాచ్‌లో 70 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 98 కిలోలు, మొత్తంగా 168 కేజీల బరువులెత్తింది. ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం, అంతర్ రాష్ట్ర విభాగంలో స్వర్ణ పతకాలు కైవసం చేసుకుంది.