ETV Bharat / sports

Tokyo Olympics: వేడి నీళ్లు లేక భారత బృందం అవస్థలు!

ఒలింపిక్స్​ కోసం టోక్యోకు చేరుకున్న భారత అథ్లెట్లు వేడి నీళ్ల విషయంలో ఇబ్బంది పడుతున్నారట. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరారు. ఆహారం విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవు.

tokyo olympics
టోక్యో ఒలింపిక్స్
author img

By

Published : Jul 19, 2021, 9:02 PM IST

ఒలింపిక్స్​ ప్రారంభానికి మరి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే ఆయా దేశాల అథ్లెట్లు టోక్యోలోని ఒలింపిక్​ గ్రామానికి చేరుకున్నారు. భారత్​ నుంచి వందకుపైగా మంది ఆటగాళ్లు జపాన్​లో అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో క్రీడాకారులకు ఎలాంటి ఆహారాన్ని ఇస్తున్నారు? ఆయా సదుపాయాల పరిస్థితి ఏంటనే దానిపై ఓ లుక్కేద్దాం.

భారత అథ్లెట్లు ఒక్కొక్కరుగా టోక్యోకు చేరుకుంటున్నారు. అయితే ఇప్పటికే అక్కడికి చేరుకున్న వారికి ఆహారం విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవట. కానీ హౌస్​ కీపింగ్, వేడి నీళ్ల విషయంలోనే కొంత అసౌకర్యానికి లోనవుతున్నారు. ఉదయాన్నే వేడి నీళ్లు తాగేందుకు ఆటగాళ్లందరికీ సరిపడా ఎలక్ట్రిక్​ కెటిల్స్​ అందుబాటులో లేక అవస్థలు పడుతున్నారు. ఈ విషయాన్ని భారత ఎంబసీ దృష్టికి తీసుకెళ్లారు.

"భారత అథ్లెట్లు రోజూ ఉదయాన్నే వేడి నీరు తాగడానికి కెటిళ్లు కావాలంటూ వినతులు వచ్చాయి. మేము ఈ విషయమై భారతీయ ఎంబసీని అభ్యర్థించాం. త్వరలోనే వారికి కెటిళ్లను అందజేస్తాం", అని ఓ అధికారి వెల్లడించారు.

వసతి సదుపాయాలు బాగున్నప్పటికీ రూమ్​లను రోజూ శుభ్రపర్చడం లేదని అథ్లెట్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ఇది మంచి విషయం కాదంటున్నారు.

ఆహారం, శిక్షణకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవని భారతీయ అథ్లెట్​ సాథియన్ తెలిపాడు. భారతీయ వంటకాలతో పాటు ప్రపంచంలోని వివిధ రకాల వంటకాలను వడ్డిస్తున్నట్లు పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: Olympics: రెజ్లర్లపై భారీ అంచనాలు.. పతకాలు సాధిస్తారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.