వచ్చే ఒలింపియాడ్ నిర్వహించేందుకు భారత్ పోటీపడనుంది. అందుకోసం బిడ్ వేయాలని భారత చెస్ సమాఖ్య నిర్ణయించింది.
"చెస్‌కు భారత్ చిరునామాగా ఉండాలన్నది మా ఆశ. ఈ లక్ష్యం దిశగా సాగేందుకు బృహత్తర ప్రణాళిక సిద్ధం చేశాం. భారత చెస్ లీగ్ మొదలు పెట్టాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాం. ఈ ఏడాదిలోనే ఫ్రాంచైజీ మోడల్ లీగ్‌ను నిర్వహిస్తాం. చెస్ ఒలింపియాడ్‌కు బిడ్ దాఖలుతో పాటు మహిళల గ్రాండ్‌ప్రి చెస్‌ను నిర్వహించాలని సంఘం సర్వసభ్య సమావేశంలో నిర్ణయించాం" అని ఇటీవలే సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నికైన సంజయ్ కపూర్ చెప్పాడు.
ఇదీ చదవండి: ఫిలిప్ ఐలాండ్ ట్రోఫీలో అంకిత శుభారంభం