ETV Bharat / sports

షూటౌట్‌లో భారత్‌ ఓటమి.. డబ్ల్యూటీటీలో భారత్​ జోడీకీ స్వర్ణం

FIH women pro league: ఎఫ్‌ఐహెచ్‌ మహిళల ప్రొ లీగ్‌ హాకీ టోర్నమెంట్లో జర్మనీతో జరిగిన పోరులో భారత్‌కు ఓటమి ఎదురైంది. కాగా, డబ్ల్యూటీటీ యూత్‌ స్టార్‌ కంటెండర్‌ టోర్నమెంట్లో భారత జంట సుహాన సైని-యశస్విని గోర్పాడే స్వర్ణం గెలిచింది.

author img

By

Published : Mar 13, 2022, 6:43 AM IST

FIH women pro league:
షూటౌట్‌లో భారత్‌ ఓటమి

షూటౌట్‌లో భారత్‌ ఓటమి

FIH women pro league: ఎఫ్‌ఐహెచ్‌ మహిళల ప్రొ లీగ్‌ హాకీ టోర్నమెంట్లో జర్మనీతో పోరులో భారత్‌కు ఓటమి ఎదురైంది. రెండు మ్యాచ్‌ల సమరంలో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో సవిత బృందం 1-2తో షూటౌట్‌లో జర్మనీ చేతిలో ఓడింది. ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయానికి రెండు జట్లు చెరో గోల్‌ చేశాయి. భారత్‌ తరఫున నవ్‌నీత్‌ కౌర్‌ (4వ నిమిషం), జర్మనీ జట్టులో కార్లోటా (5వ ని) స్కోరు చేశారు. దీంతో మ్యాచ్‌ షూటౌట్‌కు మళ్లింది. షూటౌట్‌లో నవ్‌నీత్‌ మాత్రమే గోల్‌ కొట్టగా.. షర్మిల, నేహా, లాల్‌రెమ్‌సియామి, మోనిక గురి తప్పారు. జర్మనీ జట్టులో పౌలిన్‌, సారా గోల్స్‌ సాధించి జట్టును గెలిపించారు. తొలిసారి ప్రొ హాకీ లీగ్‌లో ఆడుతున్న భారత్‌కు గత అయిదు మ్యాచ్‌ల్లో ఇది రెండో ఓటమి. మొదట చైనాతో పోరులో తొలి మ్యాచ్‌లో 7-1, ఆ తర్వాత మ్యాచ్‌లో 2-1తో నెగ్గిన భారత్‌... స్పెయిన్‌పై 2-1తో గెలిచి.. రెండో మ్యాచ్‌లో 3-4తో పోరాడి ఓడింది. జర్మనీతో తొలి మ్యాచ్‌లో ఓడినా.. మన జట్టు ప్రస్తుతం 10 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఆదివారం జర్మనీతో భారత్‌ రెండో మ్యాచ్‌ ఆడనుంది.

ఫైనల్లో వంశజ్‌, అమన్‌

Asia youth champion ship: జోర్డాన్‌లో జరుగుతున్న ఆసియా యూత్‌, జూనియర్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో యూత్‌ విభాగంలో వంశజ్‌, అమన్‌ ఫైనల్‌కు దూసుకెళ్లారు. 65.5 కేజీల విభాగం సెమీఫైనల్లో వంశజ్‌.. గత టోర్నీ రజత పతక విజేత అహ్మద్‌ నబా (సిరియా)ను నాకౌట్‌ చేశాడు. మరోవైపు 92 కేజీల పైన విభాగం సెమీస్‌లో దూకుడుగా ఆడిన అమన్‌ 4-0తో టిమ్‌ (కజకిస్థాన్‌)ను మట్టికరిపించాడు. 54 కిలోల విభాగంలో ఆనంద్‌ నిరాశ ఎదురైంది. సెమీస్‌లో ఆనంద్‌ 3-2తో బురిబొయెవ్‌ (ఉజ్బెకిస్థాన్‌)పై గెలిచినట్లు మొదట ప్రకటించారు. అయితే ప్రత్యర్థి అప్పీల్‌ చేయడంతో సమీక్షించిన రిఫరీ.. ఆనంద్‌కు వ్యతిరేకంగా తీర్పు చెప్పాడు. దీంతో ఆనంద్‌ కాంస్యంతో సరిపెట్టుకున్నాడు.

సుహాన జోడీకి స్వర్ణం

WTT tournament: డబ్ల్యూటీటీ యూత్‌ స్టార్‌ కంటెండర్‌ టోర్నమెంట్లో భారత జంట సుహాన సైని-యశస్విని గోర్పాడే స్వర్ణం గెలిచింది. మహిళల డబుల్స్‌ ఫైనల్లో సుహాన-యశస్విని 11-9, 11-7, 11-6తో ఎలీనా జహారియా-లూసియానా మిత్రోఫాన్‌ (రొమేనియా)ను ఓడించారు. సెమీస్‌లో సుహాన జంట 11-9, 11-6, 6-11, 11-5తో సోఫహ-నికోలె (ఇటలీ)పై విజయం సాధించింది.

ఫైనల్‌ చేరువలో హైదరాబాద్‌

Indian super league football: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్లో హైదరాబాద్‌ ఎఫ్‌సీ ఫైనల్‌కు చేరువైంది. శనివారం జరిగిన తొలి అంచె సెమీఫైనల్లో హైదరాబాద్‌ 3-1 గోల్స్‌తో ఏటీకే మోహన్‌బగాన్‌ను ఓడించింది. ఏటీకే తరఫున రాయ్‌కృష్ణ 18వ నిమిషంలో గోల్‌ కొట్టి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. అయితే ఆ జట్టు సంబరం అక్కడితోనే ముగిసింది. ఒబెచ్‌ (45వ ని), యాసిర్‌ (58వ ని), జావీర్‌ (64వ ని) గోల్స్‌ కొట్టి హైదరాబాద్‌ను గెలిపించారు. బుధవారం ఈ రెండు జట్ల మధ్య రెండో అంచె సెమీస్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా హైదరాబాద్‌ ముందంజ వేస్తుంది.

శరత్‌, మనిక ఔట్‌

Singapore smash tennis: సింగపూర్‌ స్మాష్‌ 2022 టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్లో భారత స్టార్లు శరత్‌ కమల్‌, మనిక బాత్రా ఇంటిముఖం పట్టారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో శరత్‌ 11-6, 7-11, 6-11, 8-11తో అన్‌టాన్‌ (స్వీడన్‌) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో మనిక 14-12 10-12, 11-13, 8-11తో మో జాంగ్‌ (కెనడా) చేతిలో పరాజయం చవిచూసింది. ఈ పోరులో తొలి గేమ్‌లో గెలిచి జోరు మీద కనిపించిన మనిక.. ఆ తర్వాత మూడు గేమ్‌లను కోల్పోయి ఓటమి చవిచూసింది. మరోవైపు సత్యన్‌ రెండో రౌండ్‌ చేరాడు. అతడు 11-6, 8-11, 11-9, 11-8తో పెంగ్‌ యీ (చైనీస్‌ తైపీ)పై విజయం సాధించాడు.

ఇదీ చదవండి: German Open: ఒలింపిక్​ ఛాంపియన్​కు షాక్​.. ఫైనల్స్​కు లక్ష్యసేన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.