ETV Bharat / sports

ప్రపంచ ఛాంపియన్​షిప్​ ఆతిథ్యం నుంచి భారత్​ ఔట్​ - India lost hosting rights for boxing

ఆతిథ్య రుసుము చెల్లించలేదన్న కారణంతో 2021 పురుషుల ప్రపంచ బాక్సింగ్​ ఛాంపియన్​షిప్​ భారత్​ నుంచి తరలిపోయింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ బాక్సింగ్​ అసోసియేషన్​ ప్రకటించింది. సెర్బియాలో ఈ పోటీలు జరగనున్నట్టు స్పష్టం చేసింది.

India loses hosting rights of 2021 men's world boxing championships
ప్రపంచ ఛాంపియన్​షిప్​ ఆతిథ్యం నుంచి భారత్​ ఔట్​
author img

By

Published : Apr 28, 2020, 10:22 PM IST

2021 పురుషుల ప్రపంచ బాక్సింగ్​ ఛాంపియన్​షిప్​కు ఆతిథ్యం వహించే హక్కును భారత్​ కోల్పోయింది. ఆతిథ్యానికి సంబంధించిన రుసుమును చెల్లించడంలో భారత్​ విఫలమవడం వల్ల 2017లో చేసుకున్న ఒప్పందాన్ని అంతర్జాతీయ బాక్సింగ్​ అసోసియేషన్​(ఏఐబీఏ) రద్దు చేసుకుంది. ఫలితంగా ఈ ఈవెంట్​కు ఆతిథ్యం వహించే అవకాశం సెర్బియాకు దక్కింది.

అయితే ఒప్పందం రద్దయిన నేపథ్యంలో 500 డాలర్ల పెనాల్టీ రుసుమును భారత్​ చెల్లించాల్సి ఉంటుందని ఏఐబీఏ స్పష్టం చేసింది.

ఈ బాక్సింగ్​ పోటీలు​.. భారత్​లో తొలిసారి జరగాల్సి ఉంది. అయితే​ రుసుము చెల్లించకపోవడం వల్ల సెర్బియాలోని బెల్​గ్రేడ్​ నగరం ఈ పోటీలను నిర్వహించనుంది. పురుషుల ప్రపంచ బాక్సింగ్​ ఛాంపియన్​షిప్​ను నిర్వహించేందుకు సెర్బియాకు అన్ని అర్హతలు ఉన్నాయని ఏఐబీఏ పేర్కొంది. అథ్లెట్లు, కోచ్​లు, అధికారులు, బాక్సింగ్​ అభిమానులకు సెర్బియా మంచి జ్ఞాపకాలను ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

ఇదీ చూడండి:- ఆ క్రికెటర్​ పెళ్లికి 3 విమానాలు మారి వచ్చిన ధోనీ

For All Latest Updates

TAGGED:

India boxing
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.