ETV Bharat / sports

ఆ క్రికెటర్​ పెళ్లికి 3 విమానాలు మారి వచ్చిన ధోనీ

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ.. తన పెళ్లికి వచ్చేందుకు చాలా శ్రమకోర్చాడని చెప్పాడు భారత క్రికెటర్ మన్​దీప్ సింగ్. ఆ విషయాల్ని తాజాగా వెల్లడించాడు.

ఆ క్రికెటర్​ పెళ్లికి 3 విమానాలు మారి వచ్చిన ధోనీ
మన్​దీప్ దంపతులతో ధోనీ
author img

By

Published : Apr 28, 2020, 7:34 PM IST

తన పెళ్లి కోసం ధోనీ, మూడు విమానాలు మారి వచ్చాడనే ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు భారత క్రికెటర్ మన్​దీప్ సింగ్. దీనితో పాటే ఎముకలు కొరికే చలిలో రెండు గంటలపాటు డ్రైవ్​ చేసుకుని వచ్చాడని అన్నాడు. అదే విధంగా మహీతో పాటు పంచుకున్న డ్రెస్సింగ్ రూమ్ అనుభవాలను వెల్లడించాడు.

"నేను పెళ్లి కార్డు ఇచ్చినప్పుడు, వివాహానికి హాజరవుతానని ధోనీ స్పష్టంగా చెప్పలేదు. ఆ సమయంలో న్యూయార్క్ వెళ్లాల్సి ఉంటుందని అన్నాడు. కానీ అనూహ్యంగా నా పెళ్లికి వచ్చి, నన్ను ఆశ్చరపరిచాడు. జీవితంలో అది మరిచిపోలేని సంఘటన. అయితే మా దగ్గరకు వచ్చేందుకు.. రాంచీ నుంచి దిల్లీకి, అక్కడి నుంచి అమృత్​సర్​కు మూడు విమానాలు మారి వచ్చాడు. తీవ్రమైన చలిలో రెండు గంటలపాటు డ్రైవ్​చేసిన మహీ, వేదిక వద్దకు చేరుకున్నాడు" -మన్​దీప్ సింగ్, భారత క్రికెటర్

2016లో జింబాబ్వే పర్యటనకు ఎంపికైన మన్​దీప్.. ఆ సమయంలో ధోనీతో బాగా స్నేహంగా ఉండేవాడినని చెప్పాడు. ఇద్దరం కలిసి భోజనం చేయడం, ప్లే స్టేషన్ ఆడటం చేసేవారమని అన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.