టోక్యో ఒలింపిక్స్‌లో భారత బాక్సర్ల సంఖ్య తొమ్మిదికి మించేలా లేదు. ఇప్పటికే అర్హత సాధించిన బాక్సర్లు మాత్రమే జులై-ఆగస్టులో జరిగే ఒలింపిక్స్‌లో బరిలో దిగే అవకాశముంది. కరోనా మహమ్మారి కారణంగా జూన్‌లో పారిస్‌లో జరగాల్సిన ఒలింపిక్ ప్రపంచ క్వాలిఫయర్స్‌ను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) రద్దు చేయడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ప్రపంచ బాక్సింగ్ కార్యకలాపాల్ని ఐఓసీ బాక్సింగ్ టాస్క్‌ఫోర్స్ పర్యవేక్షిస్తుంది.
"ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయర్ ద్వారా నిర్ణయించాలనుకున్న 53 కోటా బెర్తుల్ని (పురుషులు 32, మహిళలు 21) ప్రపంచ ర్యాంకింగ్స్ ఆధారంగా ఆఫ్రికా, అమెరికా, ఆసియా- ఓసియానియా, ఐరోపాలకు సమానంగా కేటాయిస్తాం"
- అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ
2017 నుంచి ప్రదర్శన ఆధారంగా ప్రపంచ ర్యాంకింగ్స్ నిర్ణయించనున్నారు. భారత్ నుంచి అమిత్ పంగాల్, మనీష్ కౌశిక్, వికాస్ క్రిషన్, ఆశిష్‌కుమార్, సతీశ్‌కుమార్, మేరీ కోమ్, సిమ్రన్‌జిత్ కౌర్, లవ్లినా, పూజారాణిలు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ఈ 9 మంది క్రీడాకారులే ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానాల్లో ఉన్నారు.
ఇదీ చూడండి: రెండో టెస్టులో టీమ్ఇండియా అశ్వశక్తి!