ETV Bharat / sports

HS Prannoy Match Today : సెమీస్​లో ఓడిన ప్రణయ్.. ప్రపంచ బ్యాడ్మింటన్‌ టోర్నీ నుంచి ఔట్

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 26, 2023, 11:01 PM IST

Updated : Aug 27, 2023, 9:31 AM IST

HS Prannoy Match Today : ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ భారత ఆటగాడు ప్రణయ్‌.. సెమీస్​లో ఓటమిపాలయ్యాడు. దీంతో అతడు కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

HS Prannoy Match Today
HS Prannoy Match Today

HS Prannoy Match Today : ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ షట్లర్​ హెచ్​ ఎస్​ ప్రణయ్​ సంచలన ప్రదర్శనకు తెరపడింది. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్​లో.. ప్రపంచ నెంబర్ 3 థాయ్‌లాండ్‌ ఆటగాడు మూడో సీడ్‌ కున్లావత్‌ వితిద్సన్‌ చేతిలో 21-18, 13-21, 14-21 ప్రణయ్ ఓటమిపాలయ్యాడు. దీంతో అతడికి నిరాశ ఎదురైంది. ఈ ఓటమితో ప్రణయ్.. మూడో స్థానంతో టోర్నీ నుంచి నిష్ర్కమించాడు. ఫలితంగా అతడు కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గంటా 16 నిమిషాల పాటు ఈ పోరు సాగింది. ఈ విజయంతో ప్రణయ్‌ను ఓడించిన వితిద్సన్‌ వరుసగా రెండో ఏడాదీ ఫైనల్​కు దూసుకెళ్లాడు.

Badminton World Championship Semi Final Results : కొపెన్‌హెగెన్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో ప్రణయ్ తొలి రౌండ్​లో 21 -18 తేడాతో నెగ్గాడు. ఈ గేమ్‌ హోరాహోరీగా సాగింది. ఓ దశలో 4-5తో ప్రణయ్‌ వెనుకబడ్డాడు కూడా. కానీ ఆ తర్వాతే ప్రణయ్‌ అసలైన ఆట ప్రారంభించాడు. అతడి స్మాష్‌లకు ప్రత్యర్థి దూకుడు తగ్గించాల్సి వచ్చింది. కానీ ఆఖర్లో పుంజుకున్న ప్రత్యర్థి 17-19తో ప్రణయ్‌ను దెబ్బకొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ ఒత్తిడిలోనూ ప్రణయ్‌.. ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నాడు. తొలి సెట్​ను దక్కించుకున్నాడు.

తర్వాత రౌండ్​లో పుంజుకున్న థాయ్‌లాండ్‌ ఆటగాడు.. 21-13తో మంచి కమ్​బ్యాక్​ ఇచ్చి.. రెండో రౌండ్​లో గెలిచాడు. రెండో గేమ్‌లో 5-1తో ప్రణయ్​ నిలిచిన తర్వాత పోరు మలుపు తిరిగింది. అవకాశం కోసం ఎదురు చూసిన కున్లావత్‌.. ప్రణయ్‌ తప్పిదాలను అనుకూలంగా మార్చుకున్నాడు. ఒక్కసారిగా చెలరేగుతూ రెండో గేమ్​ను సొంతం చేసుకున్నాడు. దీంతో విన్నర్ డిసైడర్ కోసం మూడో రౌండ్ ఆడాల్సి వచ్చింది.

ఈ మూడో రౌండ్​లో ప్రత్యర్థికి సరైన పోటీ ఇవ్వలేని ప్రణయ్ 21-14తో ఓడాడు. ఈ గేమ్​ ఆరంభం నుంచే ప్రత్యర్థికి చేతిలో వెనకబడిన ప్రణయ్‌ ఆధిక్యం కోల్పోయాడు. ఏ దశలోనూ కోలుకోలేకపోయాడు. మధ్యలో కాసేపు పోరు రసవత్తరంగా మారింది. కానీ చివరకి తప్పిదాలతో చేజేతులా మూల్యం చెల్లించుకున్నాడు ప్రణయ్​. దీంతో ఫైనల్స్​ చేరకుండానే ప్రణయ్ ఇంటిబాట పట్టాడు.

  • 🥉For Prannoy🏸👏

    🇮🇳's @PRANNOYHSPRI gets🥉in the BWF World Championships, Men's Singles event, after going down against 3rd seeded 🇹🇭' s Kunlavut Vitidsarn (21-18, 13-21, 14-21) 👍🏸

    Prannoy who is also a #TOPSchemeAthlete, is only the 5️⃣th 🇮🇳 in history to win a 🏅… pic.twitter.com/CPjZoYPGmo

    — SAI Media (@Media_SAI) August 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

World Athletics Championships 2023 : చోప్రా ముందు మరో అతి పెద్ద లక్ష్యం.. సాధిస్తాడా?

HS Prannoy Match Today : అదరగొట్టిన ప్రణయ్​.. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో పతకం పక్కా.. సాత్విక్​ జోడీకి నిరాశ..

Last Updated : Aug 27, 2023, 9:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.