ఫార్ములావన్ ప్రపంచ ఛాంపియన్ లూయిస్ హామిల్టన్ (మెర్సీడెజ్) జోరు కొనసాగుతోంది. అతను ఈ సీజన్లో వరుసగా రెండో గ్రాండ్‌ప్రి టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా స్టిరియన్ గ్రాండ్ ప్రిని గెలుచుకున్న ఈ బ్రిటన్ స్టార్ అదే జోరులో హంగేరియన్ టైటిల్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. ఈ గ్రాండ్‌ప్రిని ఎనిమిదిసార్లు గెలుచుకున్నాడు హామిల్టన్. ఫలితంగా ఒక సర్క్యూట్‌ను ఎక్కువ సార్లు గెలిచిన షుమాకర్ రికార్డును సమం చేశాడు. ఇంతకుముందు షుమాకర్ ఫ్రెంచ్ గ్రాండ్‌ప్రిని ఎనిమిదిసార్లు గెలుచుకున్నాడు.
![హామిల్టన్‌దే హంగేరి గ్రాండ్‌ప్రి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/lewis-hamilton-of-great-britain-driving-the-mercedes-amg-news-photo-1595085810_1907newsroom_1595176233_1087.jpg)
ఆదివారం జరిగిన తుది పోరులో హామిల్టన్ 1:36:12.473 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ రేసులో వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్), బొటాస్ (మెర్సిడెజ్) తర్వాతి రెండు స్థానాలు సాధించారు. అత్యధిక గ్రాండ్‌ప్రి విజయాలు సాధించిన మైకేల్ షుమాకర్ (91 టైటిళ్లు)కు హామిల్టన్ (86) మరింత చేరువయ్యాడు.