అన్‌లాక్-4లో భాగంగా క్రీడలతో పాటు పలు కార్యక్రమాలకు 100 మందిని అనుమతించొచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సెప్టెంబరు 21 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని పేర్కొంది.
"సోషల్, అకాడమిక్, క్రీడలు, ఎంటర్టైన్మెంట్, సాంస్కృతిక, మతపరమైన, రాజకీయ కార్యక్రమాలకు 100 మందిని అనుమతించొచ్చు. ఈ నిబంధన సెప్టెంబరు 21 నుంచి అమల్లోకి వస్తుంది" -కేంద్రం ప్రకటన
అయితే వచ్చిన వాళ్లందరూ మాస్క్‌లు ధరించడం సహా విధిగా భౌతిక దూరం పాటించాలని, చేతులు శుభ్రం చేసుకోవడం సహా శానిటైజర్స్‌ను తప్పనిసరిగా ఉపయోగించాలని కేంద్రం స్పష్టం చేసింది.
భారత్‌లో కరోనా వ్యాప్తి కారణంగా మార్చి నుంచి అన్ని క్రీడా పోటీలు నిలిచిపోయాయి. కేసులు ఎక్కువవుతున్న కారణంగానే ఐపీఎల్‌ను కూడా ఈ ఏడాది దుబాయ్‌లో నిర్వహించనున్నారు. సెప్టెంబరు 19-నవంబరు 10 వరకు ఈ లీగ్ జరగనుంది.