ETV Bharat / sports

రఫా రఫ్ఫాడించాడు.. మరోసారి ఫ్రెంచ్​ ఓపెన్​ టైటిల్​ సొంతం

author img

By

Published : Jun 5, 2022, 9:45 PM IST

French open 2022: స్పెయిన్​ బుల్​ రఫెల్​ నాదల్​ రికార్డు సృష్టించాడు. ఫ్రెంచ్​ ఓపెన్​ పురుషుల సింగిల్స్​లో విజయం సాధించింది.. 14 ఫ్రెంచ్​ ఓపెన్​ టైటిల్స్​ కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాదు.. ఈ విజయంతో రాఫెల్​ ఖాతాలోని గ్లాండ్​స్లామ్​ల సంఖ్య 22కు చేరింది.

d
d

French open 2022: గతకొన్నాళ్లగా తడబడుతూ ఇటీవల ఆస్ట్రేలియా ఓపెన్​లో 21వ గ్రాండ్​స్లామ్​ టైటిల్​ కొట్టి ఫామ్​లోకి వచ్చిన స్పెయిన్​ బుల్​ రఫెల్​ నాదల్​ ఫ్రెంచ్​ ఓపెన్​లో కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. పురుషుల సింగిల్స్​ ఫైనల్లో నార్వేకు చెందిన కాస్పెర్​ రుడ్​పై 6-3, 6-3, 6-0 తేడాతో విజయం సాధించి క్లే కోర్టులో కింగ్​ తనేనని మరోసారి రుజువుచేశాడు. ఈ విజయంతో నాదల్​ తన ఖాతాలో 22వ గ్రాండ్​స్లామ్​ టైటిల్​ను చేర్చుకున్నాడు. అంతేకాదు.. 14 ఫ్రెంచ్​ ఓపెన్ టైటిల్స్​ కొట్టిన ఆటగాడిగా నాదల్​ రికార్డు సాధించాడు.

మొదటి సెట్‌ను సునాయాసంగా గెలుపొందిన ఈ స్పెయిన్‌ బుల్‌కు రెండో సెట్‌లో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. రెండో సెట్లో మొదటి రెండు పాయింట్లు సాధించి రూడ్‌ జోరు చూపించాడు. కానీ అతడి దూకుడు ఎంతోసేపు సాగలేదు. ఆపై అద్వితీయంగా పుంజుకున్న రఫా.. రూడ్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. వరుసగా పాయింట్లు సాధిస్తూ.. రెండో సెట్‌ను కైవసం చేసుకున్నాడు. ఆఖరి సెట్‌లో మరింత విజృంభించిన ఈ ఐదో సీడ్‌ 6-0తో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఎర్రమట్టి కోర్టు పోరులో ఇప్పటికి 14 సార్లు ఫైనల్‌ చేరగా అన్ని సార్లు టైటిల్‌కు గెలుపొందాడంటే.. రోలాండ్‌ గారోస్‌లో అతడి పోరును అర్థం చేసుకోవచ్చు.

ఇదిలా ఉంటే.. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నెం.1 ఇగా స్వైటెక్‌ విజేతగా నిలిచింది. ఫైనల్‌ పోరులో స్వైటెక్‌ (పోలెండ్‌) కోకో గాఫ్‌(అమెరికా)పై 6-1, 6-3 తేడాతో వరుస సెట్లలో ఘన విజయం సాధించింది. ఆట ప్రారంభం నుంచి ఆధిపత్యం చెలాయించిన స్వైటెక్‌ ఈ పోరును కేవలం 68 నిమిషాల్లోనే ముగించడం విశేషం.

ఇదీ చూడండి : French open 2022: గార్సియా-క్రిస్టీనా జోడీదే మహిళల డబుల్స్​ టైటిల్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.