ETV Bharat / sports

French open 2022: గార్సియా-క్రిస్టీనా జోడీదే మహిళల డబుల్స్​ టైటిల్​

author img

By

Published : Jun 5, 2022, 5:39 PM IST

ఫ్రాన్స్​కు చెందిన గార్సియా-క్రిస్టీనా జోడీ ఫ్రెంచ్​ ఓపెన్​ మహిళల డబుల్స్​ టైటిల్​ను సొంతం చేసుకుంది. అమెరికాకు చెందిన కోకో-పెగులా జోడీతో జరిగిన ఈ మ్యాచ్​లో ఘన విజయం సాధించింది.

్
్్

ఫ్రెంచ్​ ఓపెన్​ టోర్నీ.. మహిళల డబుల్స్​ ఫైనల్స్​లో ఫ్రాన్స్​కు చెందిన కరోలీన్​ గార్సియా-క్రిస్టీనా మ్లడానొవిచ్​ల జోడీ విజేతగా నిలిచింది. అమెరికాకు చెందిన జెస్సికా పెగులా -కోకో గాఫ్​ల జోడితో పోరాడిన గార్సియా-క్రిస్టీనా ద్వయం 2-6, 6-3, 6-2 తేడాతో గెలుపొందింది. మొదటి సెట్లో తడబడిన ఈ ఫ్రెంచ్​ ప్లేయర్స్​.. తర్వాత రెండు సెట్లలో పుంజుకున్నారు. సొంతగడ్డపై జరిగిన ఈ టోర్నీలో ఘన విజయం సాధించారు.

మరోవైపు మహిళల సింగిల్స్​ కేటగిరిలో శనివారం జరిగిన ఫైనల్స్​లో ప్రపంచ నెం.1 ఇగా స్వైటెక్‌ మరోసారి విజేతగా నిలిచింది. పోలెండ్‌కు చెందిన స్వైటెక్‌.. ఫైనల్‌ పోరులో అమెరికాకు చెందిన కోకో గాఫ్‌పై సునాయాసంగా గెలుపొందింది. 6-1, 6-3 తేడాతో వరుస సెట్లలో ఘన విజయం సాధించింది. ఫోర్‌ హ్యాండ్‌, బ్యాక్‌ హ్యాండ్‌ షాట్లతో విరుచుకుపడుతూ.. ఆట ప్రారంభం నుంచి ఆధిపత్యం చెలాయించిన స్వైటెక్‌ ఈ పోరును కేవలం 70 నిమిషాల్లోనే ముగించడం విశేషం.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.