కరోనా ఆంక్షల నేపథ్యంలో జర్మనీలో చిక్కుకుపోయిన భారత దిగ్గజ చదరంగ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ శనివారం స్వదేశంలో అడుగుపెట్టారు. క్షేమంగా బెంగళూరుకు వచ్చినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇంటికి వచ్చిన ఆయనను.. 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించారు అధికారులు.
ఒండస్‌లీగా చెస్ లీగ్ కోసం జర్మనీ వెళ్లిన ఆనంద్.. కరోనా లాక్డౌన్ ఆంక్షల వల్ల భారత్‌కు రాలేకపోయారు. అయితే ప్రస్తుతం విదేశాల్లోని భారతీయులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం 'వందే భారత్ మిషన్' పేరుతో ప్రత్యేకంగా విమానాలు నడుపుతోంది. వాటి సాయంతో ఆనంద్ ఇంటికి వచ్చారు.
జర్మనీలో ఉంటూనే ఆనంద్.. హంపి, హరికృష్ణ తదితర భారత క్రీడాకారులతో కలిసి ఆన్‌లైన్ చెస్ టోర్నీ నిర్వహించారు. ఆ మ్యాచ్‌ల ద్వారా సేకరించిన విరాళాలను ప్రధానమంత్రి సహాయ నిధికి అందజేశారు.
ఇదీ చూడండి: క్రీడల్లో అత్యున్నత పురస్కారానికి రోహిత్‌శర్మ నామినేట్