జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అర్జున పురస్కారాల కోసం 29 మందిని సెలక్షన్ కమిటీ సిఫారసు చేసింది. ఆ జాబితా నుంచి సాక్షి మాలిక్, మీరాబాయ్‌లను తప్పించిన క్రీడా మంత్రిత్వ శాఖ.. మిగిలిన వారికి పచ్చజెండా ఊపింది. 2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సాక్షికి అదే ఏడాది ఖేల్‌రత్న లభించింది. అయితే అర్జున అవార్డు దక్కించుకోవడానికి కారణం తాను గతంలో ఖేల్‌రత్న గ్రహీతగా ఉండటమేనా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది సాక్షి మాలిక్. అర్జున అవార్డు కోసం తాను ఇంకే పతకం సాధించాలని ఆవేదన వ్యక్తం చేసింది. అర్జున అవార్డు గ్రహీత సాక్షి మాలిక్ అని పిలవాలనేదే తన లక్ష్యమని 'ఈటీవీ భారత్' చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపింది.
"ప్రతి అథ్లెట్.. వారికి సంబంధించిన అన్ని పురస్కారాలను గెలుచుకోవాలనుకుంటారు. నేను ఖేల్‌రత్నను అందుకున్నట్లుగా అర్జున అవార్డును ఎందుకు గెలుచుకోలేను. మేము చేసే ప్రయత్నాలన్నిటికీ అర్థం ఏమిటి? అర్జున అవార్డూ ప్రతి క్రీడాకారుడు కలలు కనే ఓ ప్రధాన పురస్కారం. ఆ అవార్డు పొందడానికి నేను ఇంకా ఏమి చేయాలి? నేను గతంలో పెద్ద అవార్డు పొందినందున అర్జున అవార్డుకు అవసరం లేదని అనుకున్నారా? అలా అయితే రెండు అవార్డులను అందుకున్న అథ్లెట్లు ఒకదాన్ని తిరిగి ఇవ్వాలి."
- సాక్షి మాలిక్, భారత మహిళా రెజ్లర్
భారత మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్, వెయిట్ లిఫ్టర్ మీరాభాయ్ చానులకు ఇప్పటికే రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డు లభించినందున ఆ జాబితా నుంచి వారిద్దరిని తప్పించాలని సదరు మంత్రిత్వశాఖ నిర్ణయించింది.
-
माननीय प्रधानमंत्री @narendramodi जी ओर माननीय खेल मंत्री @KirenRijiju जी । pic.twitter.com/YF1hQuJfPi
— Sakshi Malik (@SakshiMalik) August 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">माननीय प्रधानमंत्री @narendramodi जी ओर माननीय खेल मंत्री @KirenRijiju जी । pic.twitter.com/YF1hQuJfPi
— Sakshi Malik (@SakshiMalik) August 22, 2020माननीय प्रधानमंत्री @narendramodi जी ओर माननीय खेल मंत्री @KirenRijiju जी । pic.twitter.com/YF1hQuJfPi
— Sakshi Malik (@SakshiMalik) August 22, 2020
అర్జున అవార్డు గ్రహీత సాక్షి మాలిక్ అని పిలుపించుకోవడం తన కల అని ఇంటర్వ్యూలో వెల్లడించింది సాక్షి. "ఇలాంటి ప్రశంసలు పొందటానికి అథ్లెట్లు ఏదైనా చేస్తారు. అవే మమ్మల్ని ప్రేరేపిస్తాయి. నాకు అర్జున అవార్డు ఇవ్వకపోవడానికి కారణాన్ని అర్థం చేసుకోలేకపోతున్నా. ఇప్పుడు నాకు ఖేల్‌రత్న ఉందని ప్రభుత్వం నుంచి మరే ఇతర పురస్కారాన్ని ఆశించడం మానేయాలా? ఈ లాజిక్ ప్రకారం ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తర్వాత తక్కువ ప్రాధాన్యం ఉన్న టోర్నీల్లో పాల్గొనకూడదా?" అంటూ ప్రశ్నించింది సాక్షి మాలిక్.
ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, క్రీడా మంత్రి కిరణ్ రిజుజులకు ట్విట్టర్లో విన్నవించింది సాక్షి మాలిక్. ఇలాంటి చర్యల వల్ల దేశం కోసం ఏదైనా చేసే క్రీడాకారుల మనసు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని తెలిపింది. దీనిపై ఉన్నతస్థాయిలో అప్పీల్ చేయనున్నట్లు పేర్కొంది.