ETV Bharat / sports

ఈటీవీ భారత్​తో రీతూ: ఛాంపియన్​గా నిలవడమే లక్ష్యం - మార్షల్​ ఆర్ట్స్​లో రీతూ ఫొగాట్​ ఎందుకు

రెజ్లింగ్​ నుంచి మిక్స్​డ్​ మార్షల్​ ఆర్ట్స్​లో ప్రవేశించిన ఫైటర్​ రీతూ ఫొగాట్​.. వరుస బౌట్స్​లో గెలిచి సత్తా చాటుతోంది. ఈటీవీ భారత్​తో ముచ్చటించిన ఆమె.. దేశానికి ఛాంపియన్​షిప్​ బెల్ట్​ తీసుకురావడమే తన లక్ష్యమని చెప్పింది. అసలు ఎందుకు ఎమ్​ఎమ్​ఏలోకి అడుగుపెట్టాను?ఎలాంటి శిక్షణ తీసుకుంటున్నాను? లాంటి సంగతులు చెప్పింది.

ritu phogat
రితూ ఫొగాట్​
author img

By

Published : Dec 22, 2020, 4:37 PM IST

రితూ ఫొగాట్​

"నేను సరైన నిర్ణయం తీసుకున్నాను, భారత్​ తరఫున మిక్స్​డ్​ మార్షల్​ ఆర్ట్స్(ఎమ్​ఎమ్​ఏ)​లో ఓ ఛాంపియన్​ ఉండాలనేదే నా లక్ష్యం. అందుకే రెజ్లింగ్​ నుంచి ఈ క్రీడలోకి అడుగుపెట్టాను" అని భారత మహిళా రెజ్లర్​ రీతూ ఫొగాట్ చెప్పింది​. అసలు ఎందుకు ఎమ్​ఎమ్​ఏలోకి అరంగేట్రం చేసింది? దీనిపై ఆసక్తి ఎలా కలిగింది? ఛాంపియన్​గా అవతరించేందుకు ఎంతలా కష్టపడుతోంది? సహ పలు విషయాల గురించి 'ఈటీవీ భారత్'​తో ప్రత్యేకంగా ముచ్చటించింది రీతూ. ఆ సంగతులు ఆమె మాటల్లోనే..

మిక్స్​డ్​ మార్షల్​ ఆర్ట్స్​లో మీ రెజ్లింగ్​ అనుభవం ఉపయోగపడుతుందా?

రెజ్లింగ్​ నేపథ్యం నుంచి వచ్చిన వారు ఎమ్​ఎమ్​ఏ​లో బాగా రాణించగలరు. వారికి మంచి భవిష్యత్తు, లాభం ఉంటుంది. ప్రస్తుతం ఇందులో ఉన్న చాలా మంది పోరాట యోధులు మల్లయుద్ధం నేపథ్యం నుంచి వచ్చినవారే.

ఈ నిర్ణయంపై మీ నాన్న మహవీర్​​ ఎలా స్పందించారు?

నేను యూట్యూబ్​లో మిక్స్​డ్​ మార్షల్​ ఆర్ట్స్​ బాగా చూసేదానిని. అలా దానిపై అమితమైన ఇష్టం పెరిగింది. రష్యా మాజీ పోరాట యోధుడు ఖబీబ్​ వీడియోలు ఎక్కువగా చూసి ఆశ్చర్యపోయేదాన్ని. మార్షల్​ ఆర్ట్స్​లో భారత్​ తరఫున ఆడేవారు ఒక్కరూ ఎందుకు లేరని అనుకుని, మనకు ఓ ఛాంఫియన్​ ఉండాలని నిశ్చయించుకున్నాను. కానీ శిక్షణ శిబిరాలు ఎక్కడ ఉన్నాయో తెలీదు. ఎలా ఆడాలో అవగాహన లేదు.

అప్పుడే ఆసియాలోనే అతి పెద్ద జిమ్​ నుంచి ఓ అవకాశం లభించింది. నాకు ఆసక్తి ఉంటే శిక్షణ ఇస్తానని చెప్పారు. అప్పటికే రెజ్లింగ్​లో మంచి ఫామ్​లో ఉన్నాను. 2020 టోక్యో ఒలింపిక్స్​కు సన్నద్ధమవుతున్నాను. అదే సమయంలో ఎమ్​ఎమ్​ఏలోకి ప్రవేశం చేయాలనే నా ఉద్దేశం గురించి మొదటగా మా సోదరీమణులతో చర్చించాను. ఆ తర్వాత మా నాన్నకు చెప్పాను. అయితే మా కుటుంబం కాస్త ఆందోళనపడ్డారు. కానీ తర్వాత బాగా ప్రోత్సాహించారు. రెజ్లింగ్​ లేదా ఎమ్​ఎమ్​ఏ.. ఈ రెండింటిలో దేనిపై దృష్టి పెట్టిన మంచి పేరు తీసుకురావాలని నాన్న చెప్పారు.

ritu phogat
రితూ ఫొగాట్​

భవిష్యతులో ఏ ఫైటర్​ను ఢీకొట్టాలనుకుంటున్నారు?

52 కేజీల విభాగంలో తలపడటం నాకు కొంచెం కష్టంగా ఉంది. ఈ విభాగంలోని ప్రత్యర్థులను ఎదుర్కోవడం సవాలే. ప్రత్యర్థి ఎవరైనా సరే వారితో తలపడటానికి ఎప్పుడూ సిద్ధమే. అందుకోసం బాగా శ్రమిస్తాను.

ఒక్క ఛాంపియన్​షిప్​లోని నాలుగు బౌట్స్​లో గెలిచారు. భవిష్యత్తులో ఆడే బౌట్స్​కు, ఎమ్​ఎమ్​ఏ ప్రపంచ ఛాంపియన్​షిప్​ కోసం ఎలా సిద్ధమవుతున్నారు?

ఈ నాలుగు బౌట్స్​ నుంచి చాలా నేర్చుకున్నాను. ఎప్పటికప్పుడు మెరుగవుతూ వచ్చాను. నాలుగో బౌట్ గెలిచిన తర్వాత ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది. లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్తున్నాను. నైపుణ్యాలను పెంచేందుకు నా కోచ్​ మంచి శిక్షణ ఇస్తున్నారు. నాలో ఉన్న బలహీనతలపై దృష్టి పెట్టి, వాటిని అధిగమించి మరింత బలంగా తయారు కావడానికి శ్రమిస్తున్నాను. ఛాంపియన్​గా నిలిచి నా దేశ కీర్తి ప్రతిష్టలను పెంచుతాను.

ritu phogat
రితూ ఫొగాట్​

ఇదీ చూడండి : ఖేల్​రత్నకు ఎంపికైన రెజ్లర్​కు కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.