ETV Bharat / sports

'క్రికెట్ ముందు నా విజయం ఓడిపోయింది' - world university games

ఇటీవలే ఇటలీలోని నేపిల్స్​లో జరిగిన వరల్డ్​ యూనివర్సీటీ గేమ్స్​లో బంగారు పతకాన్ని సాధించింది ద్యుతీ చంద్. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. ప్రస్తుతం టోక్యో ఒలింపిక్సే​ తన లక్ష్యమని ఈటీవీ భారత్​ ప్రత్యేక ముఖాముఖిలో చెప్పింది ద్యుతి.

ద్యుతీచంద్
author img

By

Published : Jul 16, 2019, 11:49 AM IST

ద్యుతీచంద్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి

ఒడిశాలోని ఓ మారుమూల గ్రామంలో జన్మించిన ద్యుతీ చంద్.. పీటీ ఉష తర్వాత ఒలింపిక్స్​కు(2016 రియో) అర్హత సాధించిన తొలి స్ప్రింటర్​గా ఘనత కెక్కింది. ఇటీవలే నేపిల్స్​లో జరిగిన వరల్డ్ వర్సీటీ గేమ్స్​లో సత్తాచాటింది 100 మీటర్ల పరుగులో స్వర్ణపతకాన్ని కైవసం చేసుకుని వరల్డ్​ యూనివర్సిటీ గేమ్స్​లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. ఈ విజయం అంత సులభంగా దక్కలేదని అంటోంది ద్యుతీ. దీని వెనుక ఉన్న కృషిని ఈటీవీ భారత్​తో పంచుకుంది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే....

భయం భయంగానే ఫైనల్లో..

ఈ విజయం అంత సులువుగా రాలేదు. వరల్డ్​ వర్సిటీ గేమ్స్​ ఫైనల్లో కొంచెం భయమేసింది. ఎందుకంటే 100 మీటర్ల విభాగంలో నాతో తలపడిన ఐరోపా క్రీడాకారులందరికీ నా కంటే మంచి రికార్డు ఉంది.

విజయం ఒడిశా ప్రభుత్వానికి అంకితం..

100 మీటర్ల పరుగులో నెగ్గిన ఈ స్వర్ణాన్ని ఒడిషా ప్రభుత్వానికి, నా స్పాన్సర్లకు, శ్రేయోభిలాషులకు అంకితమిస్తున్నా. ఎందుకంటే నేను కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు వారే నాకు అండగా నిలిచారు. వాళ్ల మద్దతు లేకుంటే నాకు ఈ విజయం దక్కేది కాదు.

టోక్యో ఒలింపిక్సే లక్ష్యం..

ప్రస్తుతం నా దృష్టి 2020 టోక్యో ఒలింపిక్స్​పైనే ఉంది. విశ్వక్రీడల్లో దేశానికి స్వర్ణం నెగ్గాలనేది నా ఆశయం. ఇందుకు విదేశాల్లో సాధన చేయాలనుకుంటున్నా. అక్కడ పరిస్థితులకు అలవాటు పడాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకోసం ప్రోత్సాహం అందించాలని కోరుతున్నా.

కేరీర్​ ఆరంభంలో సోదరి చేయూత..

నా కెరీర్ ప్రారంభంలో చాలా కష్టాలు పడ్డాను. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు వెంటాడాయి. ఆ సమయంలో నా సోదరి అండగా నిలిచింది. అనంతరం నా విజయాలు చూసి ప్రభుత్వం సాయం చేసింది.

ఇటీవలే ఓ మహిళతో సహజీవనం చేస్తున్నానని చెప్పింది ద్యుతీ చంద్. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల నుంచి వ్యతిరేకత వచ్చింది. అయితే వరల్డ్ వర్సిటీ గేమ్స్​లో విజయం తర్వాత అంతా బాగానే ఉందని, తన కుటుంబంతో ఎలాంటి గొడవల్లేవని చెప్పుకొచ్చిందీ అథ్లెట్.

మా మధ్య ఎలాంటి గొడవల్లేవు..

నా కుటుంబంతో నాకు ఎలాంటి మనస్పర్థలు లేవు. 100 మీటర్ల పరుగులో ఎండ్​లైన్ దాటిన మరుక్షణమే.. ఇక్కడ మా వాళ్లంతా మిఠాయిలు పంచి పెట్టి నా విజయాన్ని వేడుకలా చేసుకున్నారు. కుటుంబం నుంచి ఒకరిని వేరు చేయడం అంత సులభం కాదు.

క్రికెట్​ను పట్టించుకున్నట్టు ఇతర క్రీడలను చూడట్లేదు..

నా ఫైనల్ జరిగిన రోజే భారత్ ప్రపంచకప్ సెమీస్​లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆ బాధలో ప్రజలు నన్ను మర్చిపోయారు. మీడియా కూడా క్రికెట్​ను పట్టించుకున్నట్టు ఇతర క్రీడలను కవర్ చేయలేదు. క్రికెట్​ను ప్రైవేటీకరించిన తర్వాత ఇది మరీ ఎక్కువైంది.

ఇది చదవండి:ఓడిపోయినా బెట్టింగ్ డబ్బు ​తిరిగొచ్చింది!

New Delhi, Jul 16 (ANI): A roadshow was held in national capital by Odisha Tourism to attract tourists towards vibrant culture of the state. A cultural evening was held to promote domestic tourism in India. The magnificent cultural evening was organised by Federation of Indian Chambers of Commerce and Industry (FICCI). Artists perfomed Indian classical dance form 'Odissi'. Artists mesmerised the audience with their flawless performance.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.