ప్రపంచ యువ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో ఎనిమిది మంది భారత బాక్సర్లు ఫైనల్లో అడుగుపెట్టారు. ఇందులో ఏడుగురు అమ్మాయిలే కావడం విశేషం.
గీతిక (48కేజీ), బేబీరోజిసనా చాను (51కేజీ), వింకా (60కేజీ), అరుంధతి చౌదరి (69కేజీ), పూనమ్ (57కేజీ), సనమాచు చాను (75కేజీ), అల్ఫియా పఠాన్ (+81కేజీ) మహిళల విభాగం సెమీఫైనల్స్‌లో నెగ్గి స్వర్ణ పోరుకు అర్హత సాధించారు.
పురుషుల విభాగంలో సచిన్ (56కేజీ) పసిడి కోసం పోటీపడనున్నాడు. మరో ముగ్గురు భారత బాక్సర్లు అంకిత నర్వాల్ (64కేజీ), విశ్వామిత్ర చొంగ్తామ్ (49కేజీ), విశాల్ గుప్తా (91 కేజీ) కాంస్య పతకాలతో సంతృప్తి చెందారు.
మొత్తం మీద 11 పతకాలతో భారత్ టోర్నీని ముగించనుంది. ప్రపంచ యూత్ బాక్సింగ్‌లో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఇంతకుముందు అత్యధికంగా 2018లో 10 పతకాలు సాధించింది.