ETV Bharat / sports

ఎనిమిది మంది భారత బాక్సర్లకు ఒలింపిక్స్​ టికెట్లు

author img

By

Published : Mar 10, 2020, 6:44 PM IST

భారత బాక్సర్లు అంతర్జాతీయ వేదికపై మరోసారి సత్తా చాటారు. తాజాగా జోర్డాన్​లోని అమ్మాన్​ వేదికగా జరుగుతున్న ఆసియా ఒలింపిక్స్​ క్వాలిఫయర్స్​ టోర్నీలో మనోళ్లు అదరగొట్టేశారు. ఫలితంగా ఒకేసారి ఎనిమిది మంది టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించారు.

Eight India boxers qualify for Tokyo Olympics 2020 and the record equal to London Olympics
ఒలింపిక్స్​కు ఎనిమిది మంది భారత బాక్సర్లు అర్హత

టోక్యో వేదికగా ఈ ఏడాది జరగనున్న ఒలింపిక్స్​కు.. తాజాగా ఎనిమిది మంది భారత బాక్సర్లు అర్హత సాధించారు. ఇందులో స్టార్​ ప్లేయర్లు అమిత్​ పంఘాల్​, మేరీ కోమ్​, సిమ్రన్​జిత్​ కౌర్​తో పాటు పూజా రాణి, లవ్లీనా, వికాశ్​, సతీష్​, ఆశిష్​ ఉన్నారు.

తాజాగా జరిగిన క్వాలిఫయింగ్​ టోర్నీలో సిమ్రన్​ జిత్​(60 కేజీలు) సెమీఫైనల్​ చేరింది. ఈ ప్రదర్శనతో టోక్యోకు అర్హత సాధించింది. తర్వాతి పోరులో షియివు(చైనీస్​ తైపీ)తో తలపడనుంది. గతంలో లండన్​ ఒలింపిక్స్​కు ఇంతేమంది అర్హత సాధించారు.

మరో బాక్సర్​ మనీశ్​ క్వార్టర్​ ఫైనల్లో 2-3 తేడాతో చిన్​జోరిగ్​(మంగోలియా)చేతిలో ఓడిపోయాడు. సచిన్​ కుమార్​(81 కేజీలు) విభాగంలో క్వార్టర్స్​లో ఓడిపోయాడు. వీరిద్దరూ టబాక్సాఫ్​' ద్వారా టోక్యో బెర్త్​ దక్కించుకునేందుకు మరో అవకాశం ఉంది. వీళ్లకి టోక్యో టికెట్టు దక్కితే.. బౌక్సింగ్​లో భారత ప్రాతినిధ్యం పదికి చేరనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.