ETV Bharat / sports

ముగిసిన వివాదం.. చానుకు అర్జున అవార్డు

భారత మహిళా వెయిట్​ లిఫ్టర్​ సంజిత చానుకు నిలిపివేసిన 2018 నాటి అర్జున అవార్డును ప్రదానం చేయనున్నట్లు స్పష్టం చేసింది క్రీడా మంత్రిత్వ శాఖ. దిల్లీ కోర్టు తీర్పు మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇటీవల చానుపై ఉన్న డోపింగ్ ఆరోపణలను​ ఐడబ్ల్యూఎఫ్​ ఉపసంహరించుకోవడమే ఇందుకు కారణం.

sanjita chanu
సంజిత చను
author img

By

Published : Jun 25, 2020, 2:59 PM IST

భారత మహిళా వెయిట్​ లిఫ్టర్​ సంజిత చానుపై ఉన్న డోపింగ్​ మచ్చ తొలిగిపోయింది. దీంతో ఆమెకు నిలిపివేసిన 2018 నాటి అర్జున అవార్డును త్వరలోనే ప్రదానం చేయనున్నట్లు క్రీడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దిల్లీ కోర్టు తీర్పు మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపింది.

"సంజిత చానుపై ఉన్న డోపింగ్ ఆరోపణలను​ ఐడబ్ల్యూఎఫ్​ ఉపసంహరించుకుంది. అందువల్ల 2018 దిల్లీ హైకోర్టు తీర్పు ప్రకారం సంజితకు అర్జున అవార్డు ప్రదానం చేస్తాం."

-క్రీడా మంత్రిత్వ శాఖ.

క్వీన్స్​లాండ్​లోని గోల్డ్​కోస్ట్​లో జరిగిన 2018 కామన్​వెల్త్​ క్రీడల్లో.. మహిళల 53 కిలోల విభాగంలో స్వర్ణ పథకం సాధించింది చాను. అదే ఏడాది డోపింగ్​ ఆరోపణలతో మే 15న ఆమెపై తాత్కాలిక సస్పెషన్ పడింది.​ ప్రస్తుత ఆమెపై ఉన్న నిషేధాన్ని తొలగించిన కారణంగా అర్జున్ అవార్డును అందజేయనున్నట్లు క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది.

sanjitha
సంజిత

ఇది చూడండి : ధోనీ ముఖ్య అతిథిగా భారత​ ఆర్చర్ల పెళ్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.