ETV Bharat / sports

'ఒలింపిక్స్​ అదనపు ఖర్చులు అనుకున్నదానికంటే ఎక్కువే'

author img

By

Published : Mar 26, 2020, 6:23 PM IST

ఒలింపిక్స్ వచ్చే ఏడాది నిర్వహించడం వల్ల ఖర్చులు భారీగా పెరగనున్నాయని నిర్వహకులు అంటున్నారు. వాటిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక టాస్క్​ఫోర్స్​ను ఏర్పాటు చేశారు.

Delaying Olympics will involve 'massive' costs, organisers say
ఒలింపిక్స్​ వాయిదాతో అదనపు ఖర్చులు

కరోనా​ వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ వాయిదా పడ్డాయి. వచ్చే ఏడాది జరపాలని నిర్ణయించారు. అయితే దీని వల్ల అదనపు ఖర్చులు భారీగా ఉంటాయని నిర్వహకులు చెబుతున్నారు. అందుకోసం ఓ కార్యదళాన్ని(టాస్క్​ఫోర్స్)​ ఏర్పాటు చేశారు. గురువారం తొలి సమావేశం జరిపారు. ఇందులో మాట్లాడిన టోక్యో ఒలింపిక్స్ సీఈఓ తోషిరో మ్యూటో పలు విషయాలు చెప్పారు.

ఈ వాయిదా తరుణంలో తమకు ఎదురయ్యే సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వెళ్తామని అన్నారు. అదనపు ఖర్చులు తాము అనుకున్న దానికంటే ఎక్కువేనని, దీనిపై మరింత కృషి చేయాల్సి ఉందని చెప్పారు. అయితే వాయిదా వల్ల ఎంత ఖర్చులు పెరుగుతాయో ఇప్పుడే చెప్పాలేనని స్పష్టం చేశారు.

2.7 బిలియన్​ డాలర్లు అదనం!

ఒలింపిక్స్, వచ్చే ఏడాది జరిపితే అదనంగా దాదాపు 2.7 బిలియన్​ డాలర్లు ఖర్చవుతుందని నిర్వహకులు భావిస్తున్నట్లు స్థానిక దినపత్రిక రాసుకొచ్చింది. ఇందులో వేదిక స్థలం అద్దె, హోటల్స్​ మళ్లీ బుక్​ చేయడం, భద్రత సంబంధిత వివరాలు ఉన్నాయని పేర్కొంది.

గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాకపోవడం వల్ల, ఒలింపిక్స్ నిర్వహణలో తమకు కొత్త సవాళ్లు ఎదురయ్యాయని అన్నారు టోక్యో 2020 ఒలింపిక్స్ అధ్యక్షుడు యోషిరో మోరీ.

ఇదీ చదవండి: టోక్యో​ ప్రభావం పారిస్​ ఒలింపిక్స్​పై​ పడనుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.