ETV Bharat / sports

పన్నెండేళ్లకే చెస్‌కు అంకితమా: విషీ - విశ్వనాథన్​ ఆనంద్​

లాక్​డౌన్​ కారణంగా జర్మనీలో చిక్కుకుపోయిన భారత దిగ్గజ చెస్​ ఆటగాడు.. సాయ్​ డైరెక్టర్లతో ఆన్​లైన్​లో మాట్లాడాడు. వర్థమాన ఆటగాళ్లు ప్రత్యేక చెస్​కంప్యూటర్లు వాడేలా చూడాల్సిన బాధ్యత సాయ్​పై ఉందని అన్నాడు. అయితే.. 12 ఏళ్లకే పిల్లలు చెస్​ను తమ పూర్తిస్థాయి కెరీర్​గా ఎంచుకోవడం ఆందోళన కలిగిస్తోందన్నాడు.

.Dedicated to chess at the age of 12.. is it right: Vishy
12 ఏళ్లకే చెస్‌కు అంకితమా: విషీ
author img

By

Published : Apr 23, 2020, 6:34 AM IST

12 ఏళ్ల వయసులోనే పిల్లలు చెస్‌ను కెరీర్‌గా ఎంచుకొని, పూర్తి సమయం దానిమీదే దృష్టి పెట్టడం ఆందోళన కలిగిస్తోందని భారత దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్‌ ఆనంద్‌ అంటున్నాడు. ప్రయాణ ఆంక్షల కారణంగా జర్మనీలో చిక్కుకుపోయిన అతను.. కొత్తగా నియమితులైన భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్‌) డైరెక్టర్లతో ఆన్‌లైన్‌లో మాట్లాడాడు.

'శిక్షణ పొందేందుకు సాయ్‌లో అన్ని వసతులు, సౌకర్యాలున్నాయి. అయితే వర్థమాన ఆటగాళ్లు ప్రత్యేక చెస్‌ కంప్యూటర్లు వాడేలా చూడాల్సిన బాధ్యత సాయ్‌ మీద ఉంది. చాలా మంది ఆటగాళ్లకు ఈ సౌకర్యం అందుబాటులో లేదు. 12 ఏళ్ల వయసులోనే పిల్లలు చెస్‌ను పూర్తిస్థాయి కెరీర్‌గా ఎంచుకోవడం ఆందోళన కలిగిస్తోంది. 18 ఏళ్లు వచ్చిన తర్వాత, చదువు పూర్తి అయిన తర్వాత మాత్రమే పిల్లలు చెస్‌ కెరీర్‌ గురించి ఆలోచించాలి. పిల్లలు ఏం అవ్వాలనుకుంటున్నారో నిర్ణయించుకునే స్వేచ్ఛ తల్లిదండ్రులు వాళ్లకివ్వాలి. కరోనా కారణంగా లభించిన ఈ విరామంలో ఫిట్‌నెస్‌ మెరుగు పర్చుకోవడంపై ఆటగాళ్లు దృష్టి పెట్టాలి. యుక్త వయసులో ఉన్నపుడు ఫిట్‌నెస్‌ సమస్య ఉండదు. కానీ వయసు మీద పడే కొద్దీ దాని అవసరం తెలుస్తుంది. ఓ వారం పాటు సాయ్‌ కేంద్రాలకు వెళ్లి మిగతా అథ్లెట్లతో కలిసి సాధన చేయాలి' అని ఆనంద్‌ తెలిపాడు.

ఆన్‌లైన్‌ చెస్‌కు ఎప్పటి నుంచో ఆదరణ ఉందని, తాజాగా లాక్‌డౌన్‌తో దాని ప్రాధాన్యత మరింత పెరిగిందని విషీ పేర్కొన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.