సాగర్ దంకర్ అనే రెజ్లర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుశీల్ కుమార్‌కు(wrestler sushil kumar news) దిల్లీ హైకోర్టు మరోసారి బెయిల్ నిరాకరించింది. మంగళవారం రెండు వర్గాల వాదోపవాదాలను విన్న తర్వాత కోర్టు అదనపు సెషన్స్ న్యాయమూర్తి శివాజీ ఆనంద్.. అతడికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు. పోలీసులు తనపై అన్యాయంగా కేసు పెట్టారని.. తన ప్రతిష్టకు భంగం కలిగించారన్న సుశీల్(susheel kumar jail) వాదనలను ఆయన తోసిపుచ్చారు.
దిల్లీలో ఛత్రసాల్ స్టేడియంలో సుశీల్ మరికొందరితో కలిసి దాడి చేయడంతో సాగర్ అనే రెజ్లర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆపై అతను చికిత్స పొందుతూ మరణించాడు. హత్య అనంతరం కొన్ని రోజులు తప్పించుకుని తిరిగిన సుశీల్, తర్వాత పోలీసులకు పట్టుబడ్డాడు. 38 ఏళ్ల సుశీల్ జూన్ 2 నుంచి జైల్లో ఉన్నాడు.
ఇదీ చదవండి: