ETV Bharat / sports

హర్మన్​ప్రీత్​ హ్యాట్రిక్​ గోల్స్​.. సెమీస్​కు దూసుకెళ్లిన హాకీ టీం

Commonwealth games 2022: వేల్స్​తో శుక్రవారం జరిగిన మ్యాచ్​లో భారత హాకీ జట్టు ఘన విజయం సాధించింది. ప్రత్యర్థిని చిత్తు చేసిన భారత్​ సెమీఫైనల్​కు చేరింది.

హాకీ జట్టు
హాకీ జట్టు
author img

By

Published : Aug 4, 2022, 10:12 PM IST

Commonwealth games 2022: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత హాకీ పురుషుల జట్టు అదరగొడుతోంది. బర్మింగ్​హోమ్​ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం వేల్స్​తో జరిగిన మ్యాచ్​లో ప్రత్యర్థిపై భారీ విజయం సాధించింది. వేల్స్​పై 4-1 ఆధిక్యాన్ని నమోదు చేసిన భారత్​.. సెమీస్​కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్​లో హర్మన్​ప్రీత్​ సింగ్​ చేసిన ప్రదర్శన జట్టును విజయ తీరాలకు చేర్చింది. హర్మన్​ప్రీత్​ ఈ మ్యాచ్​లో హ్యాట్రిక్​ గోల్స్​ కొట్టాడు. ఈ నెల 6న (శనివారం) సెమీఫైనల్​ జరగనుంది. ఆ మ్యాచ్​లో భారత్​ న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ విజయంతో భారత్‌ గ్రూప్‌ స్టేజ్‌లో 3 విజయాలు, ఒక డ్రాతో నిలిచింది.

మరోవైపు అథ్లెటిక్స్​ మహిళల 200 మీటర్ల రేసులో హిమ దాస్​ ఇప్పటికే సెమీస్​కు చేరుకోగా.. మహిళల హ్యామర్​ త్రో ఈవెంట్​లో మంజుబాలా ఫైనల్​ చేరింది. బాక్సింగ్ విభాగంలో అమిత్​ పంఘల్, లంబోరియా, సాగర్​లు శుక్రవారం మెరుగైన ప్రదర్శన చేసి మూడు కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు.

ఇదీ చూడండి: 'అతడు కాబోయే వరల్డ్‌ నెం.1 బౌలర్‌.. ప్రపంచకప్‌ జట్టులోకి తీసుకోవాల్సిందే!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.