ETV Bharat / sports

Chess: ప్రజ్ఞానంద ఖాతాలో మరో రెండు విజయాలు - కార్లసన్​ ప్రజ్ఞానంద

Chess champion Praggnanandhaa: ఆన్‌లైన్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌ ఎయిర్‌థింగ్స్‌ మాస్టర్స్‌లో భాగంగా సోమవారం ప్రపంచ నెం.1 చెస్‌ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ను ఓడించిన భారత యువ కెరటం ప్రజ్ఞానంద తాజాగా మరో రెండు విజయాలు సాధించాడు. దీంతో అతడు 15 పాయింట్లతో 12వ స్థానంలో నిలిచాడు.

Chess champion Praggnanandhaa
భారత యువ గ్రాండ్​మాస్టర్​ ప్రజ్ఞానంద
author img

By

Published : Feb 22, 2022, 2:10 PM IST

Chess champion Praggnanandhaa: ఆన్‌లైన్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌ ఎయిర్‌థింగ్స్‌ మాస్టర్స్‌లో ప్రపంచ నెం.1 చెస్‌ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ను ఓడించిన భారత యువ గ్రాండ్​మాస్టర్​ ప్రజ్ఞానంద మరో రెండు రౌండ్లలో విజయం సాధించాడు. మంగళవారం జరిగిన పోటీల్లో ఈ 16 ఏళ్ల కుర్రాడు రష్యా ఆటగాడు నాడిర్‌బెక్‌ అబ్దుసట్టారావ్‌తో డ్రా చేసుకోగా.. 10, 12 రౌండ్లలో అండ్రీ ఎసిపెంకో, అలెగ్జాండ్రా కోస్టిన్యూక్‌లను ఓడించాడు. ఈ క్రమంలోనే 11వ రౌండ్‌లో జీఎం లాన్‌ నెమోనియాచి చేతిలో ఓడిపోయాడు. దీంతో ప్రజ్ఞానంద ఇప్పుడు 15 పాయింట్లతో 12వ స్థానంలో నిలిచాడు.

ఇక నేడు(మంగళవారం) రాత్రి జరిగే పోటీల్లో ప్రజ్ఞానంద మరో ముగ్గురు ప్లేయర్లతో తలపడనున్నాడు. తొలుత 13వ రౌండ్‌లో జర్మనీ ప్లేయర్‌ విన్‌సెట్‌ కీమర్‌తో, 14వ రౌండ్‌లో అమెరికా ప్లేయర్‌ హాన్స్‌ మోకె నీమన్‌తో పోరాడాక చివరగా 15వ రౌండ్‌లో రష్యా ఆటగాడు వ్లాదిస్లేవ్‌ ఆర్తెమీవ్‌తో పోటీపడనున్నాడు.

కాగా, సోమవారం ప్రజ్ఞానంద చేతిలో ఓటమిపాలైన కార్ల్‌సన్‌ మంగళవారం ఫామ్​లోకి వచ్చాడు. అతడు వరుసగా క్వాంగ్‌ లీమ్‌ లె, జాన్‌ క్రీస్టాఫ్‌ దుడాపై గెలుపొందాడు. కానీ, కెనడా ఆటగాడు ఎరిక్‌ హాన్‌సెన్‌ చేతిలో ఎదురుదెబ్బ తగిలి ప్రస్తుతం 20 పాయింట్లతో అర్తెమీవ్‌, కీమర్‌తో సమానంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఈ పోటీల్లో టాప్‌ ఎనిమిది స్థానాల్లో నిలిచిన ప్లేయర్లే తర్వాత జరిగే నాకౌట్‌ దశకు చేరుకుంటారు. దీంతో ప్రజ్ఞానంద అక్కడికి చేరాలంటే ఇంకా బాగా రాణించాల్సి ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న తొలిదశ పోటీల్లో ఇంకా ఏడు రౌండ్లు మిగిలి ఉన్నాయి.

ఇదీ చూడండి: ప్రపంచ నెం.1కు షాకిచ్చిన భారత యువ గ్రాండ్​మాస్టర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.