అమెరికా కాలిఫోర్నియాలో ఓ బేస్బాల్ మ్యాచ్ సందర్భంగా అనూహ్య సంఘటన జరిగింది. తన ఫేవరెట్ జట్టుకు మద్దతు తెలిపే క్రమంలో ఓ యువతి హద్దుమీరి ప్రవర్తించింది. స్టేడియంలో ఉన్నవారికి తన వక్షోజాలను ప్రదర్శిస్తూ డాన్సులు వేసింది. దీంతో ఆమెను బలవంతంగా బయటకు గెంటేశారు అక్కడి సెక్యూరిటీ సిబ్బంది.
![Caught flashing boobs during baseball game](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15532500_5.jpg)
ఇదీ జరిగింది: జూన్ 4న లాస్ ఏంజెలెస్ డాడ్జర్స్, షికాగో వైట్ సాక్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన జరిగింది. డాడ్జర్స్ జట్టుకు మద్దతు తెలపడానికి ఒకడుగు ముందుకేసి స్టేడియంలోనే తన వక్షోజాలను ప్రదర్శిస్తూ గంతులేసింది ఓ యువతి. ఆమె చర్యలకు భద్రతా సిబ్బంది వద్ద పలువురు ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేయగా.. వారు ఆమెను బలవంతంగా బయటకు పంపించేశారు.
ఆమె డాన్స్ చేసిన వీడియో సహా మద్యం మత్తులో ఉన్న ఆమెను సెక్యూరిటీ సిబ్బంది బయటకు ఈడ్చుకెళ్లిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఆమెకు మద్దతుగానూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సరదాగా చేసిన పనికి అంత బలవంతంగా లాక్కెళ్లాల్సిన పనిలేదని అంటున్నారు.
ఇదీ చూడండి: 'చాలా కష్టపడ్డా.. పెద్ద యుద్ధమే చేశా.. ఇప్పుడు నేను హ్యాపీ'