జులై 23 నుంచి తమ దేశంలో మొదలవనున్న ఒలింపిక్స్‌ను రద్దు చేసేందుకు అవకాశం లేకపోలేదని జపాన్ అధికార డెమొక్రటిక్ పార్టీ జనరల్ సెక్రటరీ తోషిహిరో నికై తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో క్రీడలను నిర్వహించటం కష్టమని నిర్వహకులు భావిస్తే.. రద్దు చేసే అవకాశం ఉందని వెల్లడించారు. ఓ టెలివిజన్ కార్యక్రమంలో నికై ఈ మేరకు అన్నారు.
టోక్యో వేదికగా ఓలింపిక్స్ క్రీడలు.. గత ఏడాదిలోనే నిర్వహించాల్సి ఉంది. వైరస్ దృష్ట్యా 2021 జులైకి వాయిదాపడ్డాయి.
జపాన్‌లో ఇప్పటివరకు 5 లక్షల 16వేల కేసులు నమోదయ్యాయి. 9,400 మంది మృతి చెందారు.
ఇదీ చదవండి: కరోనా కరుణిస్తేనే.. విశ్వక్రీడా సంబరం!