ETV Bharat / sports

BWF Ranking Mens Doubles 2023 : చరిత్ర సృష్టించిన 'గోల్డ్ బాయ్స్​'.. తొలి భారత జోడీగా సాత్విక్‌-చిరాగ్‌ రికార్డ్

BWF Ranking Mens Doubles 2023 : ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో గోల్డ్​ మెడల్​ సాధించిన భారత స్టార్​ బ్యాడ్మింటన్ ప్లేయర్లు సాత్విక్​ సాయిరాజ్​, చిరాగ్​శెట్టి.. ఇప్పుడు మరో ఘనత సాధించారు. ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంకు ఖరారు చేసుకుని.. ఈ ఘనత సాధించిన తొలి భారత జోడీగా చరిత్ర సృష్టించారు.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 10, 2023, 2:29 PM IST

BWF Ranking Mens Doubles 2023 : భారత బ్యాడ్మింటన్‌లో ఎవరూ అందుకోలేని ఎత్తులకు చేరుకుంటూ.. మునుపు ఎవరూ వెళ్లని స్థానాలకు వెళుతూ రికార్డుల మీద రికార్డులు నెలకొల్పారు భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లు సాత్విక్ సాయిరాజ్​, చిరాగ్​ శెట్టి. 'బ్రదర్స్‌ ఆఫ్‌ డిస్ట్రక్షన్‌'గా పేరు పొందిన ఈ బ్యాడ్మింటన్ ద్వయం.. తాజాగా ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంకు ఖరారు చేసుకుని ఈ ఘనత సాధించిన తొలి భారత జోడీగా చరిత్ర సృష్టించారు. వీరి నంబర్​ వన్​ స్థానం మంగళవారం అధికారికం కానుంది.

Satwik Chirag Asian Games : ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో డుబుల్స్​ విభాగంలో స్వర్ణం సాధించింది ఈ జోడీ. అయితే ఐదేళ్ల ముందు వరకు సాత్విక్‌-చిరాగ్‌ ఒక సాధారణ జంట మాత్రమే! కానీ స్వల్ప కాలంలోనే అసాధారణంగా ఎదిగి.. వరల్డ్​ ర్యాంకును సొంతం చేసుకోవడం అనూహ్యం. వీళ్ల ప్రయాణంలో.. జాతీయ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌, డబుల్స్‌ కోచ్‌ మతియాస్‌ బో.. సాత్విక్‌, చిరాగ్‌ల తల్లిదండ్రులు ఈ ప్రయాణంలో కీలకంగా నిలిచారు.

  • ASIAN GAMES GOLD MEDALISTS 🏆
    To all who cheered, believed, and stood by me - this gold is as much yours as it is ours. Holding this gold, I feel the weight of your love and support more than ever. This victory belongs to all of us. Thank you Jai Hind 🇮🇳 pic.twitter.com/GSouLRYgXM

    — Satwik SaiRaj Rankireddy (@satwiksairaj) October 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Chirag Shetty And Satwiksairaj Ranking : బ్యాడ్మింటన్‌లో డబుల్స్‌ అత్యంత క్లిష్టమైన ఈవెంట్‌. ఎంతో సరళత, వేగం, టెక్నిక్‌, సమన్వయం, ఏకాగ్రత ఉంటే తప్ప ముందుకు కదలలేరు. సంవత్సరాల తరబడి చైనా, మలేసియా ఆటగాళ్లకు పెట్టని కోటగా డబుల్స్‌ ఈవెంట్ ఉంది. అందులో ఓ భారత జోడీ సంచలన విజయాలు సాధించడం, నంబర్‌వన్‌గా ఎదగడం చాలా కష్టం. కానీ ఒక్కసారిగా దూసుకొచ్చిన సాత్విక్‌, చిరాగ్​ ద్వయం.. గత కొన్నేళ్లుగా సంచలన విజయాలతో ముందుకు సాగుతోంది. గతేడాది టాప్‌-10లో అన్ని జోడీలను ఓడించి కొరకరాని కొయ్యగా మారింది.

ఇక 2022 ఏడాది సాత్విక్‌-చిరాగ్‌ కెరీర్‌ను మరో స్థాయికి చేర్చింది. థామస్‌కప్‌లో చరిత్రాత్మక స్వర్ణ పతకం గెలవడంలో కీలకపాత్ర పోషించిన ఈ జోడీ.. అదే ఏడాది కామన్వెల్త్‌ క్రీడల్లోనూ పసిడిని ముద్దాడింది. టోక్యో వేదికగా జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యాన్ని పతకాన్ని దక్కించుకుంది. ఇక ఈ ఏడాది కూడా ఈ జోడీ దూసుకెళ్తోంది. ఆసియా ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్​ మెడల్​ గెలవడమే కాకుండా.. ఆసియా క్రీడల్లో డబుల్స్‌లో స్వర్ణం, టీమ్‌లో రజతాన్ని కైవసం చేసుకుంది. ముఖ్యంగా తమ జోరుకు చాలా టోర్నీల్లో అడ్డుకట్ట వేసిన అరోన్‌ చియా-సో వీయ్‌ (మలేసియా)ను సెమీస్‌లో ఓడించిన తీరు అద్భుతం.

సాత్విక్​- చిరాగ్ అదరహో.. 52 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఆసియా బ్యాడ్మింటన్‌లో గోల్డ్​ మెడల్

Asian Games India Medals 2023 : సాత్విక్​-చిరాగ్​ జోడీ అదరహో.. భారత్​కు మరో గోల్డ్.. చరిత్రలో తొలిసారి..​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.