ETV Bharat / sports

'ఇంటికి రంగులేశా.. అమ్మకు సాయం చేస్తున్నా' - ఇంటికి రంగులేసిన బాక్సర్​ నిఖత్​ జరీనా

కరోనా లాక్​డౌన్​ కారణంగా ఇంటికే పరిమితమైంది తెలంగాణ బాక్సర్​ నిఖత్​ జరీన్​. ఇంటి వద్దే ఉంటూ వర్కౌట్​ వీడియోలను రోజూ కోచ్​కు పంపిస్తున్నట్లు తెలిపింది. ఖాళీ సమయంలో వంట చేస్తున్నానని.. ఇటీవలే ఇంటికి రంగులేశానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

BOXER NIKHAT ZAREEN SPECIAL INTERVIEW IN LOCKDOWN
'ఇంటికి రంగులేశా.. వంటింట్లో అమ్మకు సాయం చేస్తున్నా'
author img

By

Published : May 23, 2020, 7:49 AM IST

లాక్‌డౌన్‌ సమయంలో ఇంటికి రంగులేయటంతో పాటు వంటనూ తానే చేశానని అంటోంది తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌. కరోనా నేపథ్యంలో రెండు నెలలుగా ఇంటి పట్టున ఉంటూ ఏమేం చేసిందో నిఖత్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

"ఇన్ని రోజుల పాటు ఇంట్లోనే ఉండటం నాలుగేళ్లలో ఇదే ప్రథమం. ఎప్పుడూ 3, 4 రోజులకు మించి ఇంట్లో ఉండను. దిల్లీలో ఏడాదంతా జాతీయ శిక్షణ శిబిరంలో బిజీగా ఉంటా. ఇప్పుడు పూర్తిగా ఇంట్లోనే. ఇక్కడ శిక్షణకు అవకాశం లేదు. అయితే ఫిట్‌నెస్‌ సాధన కొనసాగుతోంది. కసరత్తుల వీడియోలు వాట్సాప్‌ గ్రూపులో పంపాలి. ఏమేం చేస్తున్నది కోచ్‌ పర్యవేక్షిస్తుంటాడు. భౌతిక దూరం పాటించాల్సి ఉండటం వల్ల ఇతరులతో కలిసి సాధన చేయట్లేదు. మిగతా సమయంలో వంట గదిలో అమ్మకు సహాయం చేస్తున్నా. లాక్‌డౌన్‌లో పూర్తిస్థాయి చెఫ్‌గా మారిపోయా" అని తెలిపింది.

BOXER NIKHAT ZAREEN SPECIAL INTERVIEW IN LOCKDOWN
బాక్సర్​ నిఖత్​ జరీన్​

గదికి రంగులు

"రంజాన్‌ పండుగకు ఇంటికి రంగులు వేయాలని అనుకున్నాం. బయటి వాళ్లు ఇంట్లోకి వస్తే సమస్య అవుతుందేమోనని నా బెడ్‌ రూమ్‌కు నేనే రంగులు వేసుకున్నా. రెండ్రోజులు రంగులు వేసి గదిని అందంగా తీర్చిదిద్దుకున్నా. పండుగ తర్వాత మిగతా గదులకు రంగులు వేస్తా. గత ఏడాది రంజాన్‌ రోజు షీర్‌ కుర్మా చేసి తోటి క్రీడాకారులు, కోచ్‌లకు తినిపించా. ఈసారి సంబరాలు చేసుకోదల్చుకోలేదు. దేశంలో ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటి వారిని చూస్తూ కొత్త బట్టలు కొనుక్కుని సంబరాలు చేసుకోవడం సముచితం కాదనిపిస్తోంది" అని నిఖత్‌ చెప్పింది.

ఇదీ చూడండి... ఐసీసీలో 'దాదా'గిరికి క్రికెట్​ బోర్డుల మద్దతు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.