ETV Bharat / sports

బాక్సర్ లవ్లీనాకు సీఎం సత్కారం.. డీఎస్పీగా బాధ్యతలు అప్పగింత

Boxer Lovlina News: టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, బాక్సర్​ లవ్లీనాకు డీఎస్పీ పదవిని అప్పగించి సత్కరించింది అసోం సర్కారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె పోలీసు శాఖకు ధన్యవాదాలు తెలిపింది. బాక్సింగ్​కు రిటైర్మెంట్​ ప్రకటించాక ఉద్యోగంలో చేరుతానని చెప్పింది.

lovlina
లవ్లీనా
author img

By

Published : Jan 12, 2022, 5:42 PM IST

Boxer Lovlina News: ఒలింపిక్స్​ కాంస్య పతక విజేత బాక్సర్​ లవ్లీనా​కు డీఎస్పీ బాధ్యతలను అప్పగించింది అసోం ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ.. లవ్లీనా భవిష్యత్తులో ఎస్పీ కూడా అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. డీఎస్పీ పదవికి సంబంధించిన అపాయింట్​మెంట్​ లెటర్​ను లవ్లీనాకు అందజేశారు.

lovlina boxer
డీఎస్పీ బాధ్యతలు అప్పగిస్తూ పత్రం అందిస్తున్న సీఎం

టోక్యో ఒలింపిక్స్​లో లవ్లీనా పతకం సాధించడం రాష్ట్రానికే గర్వకారణమని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. ఇప్పటినుంచి బాక్సర్​కు నెల జీతంతో పాటు ట్రైనింగ్​ కోసం అదనంగా రూ. 1 లక్ష ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. గువాహటిలోనే ఆమె బాక్సింగ్​ ట్రైనింగ్​ తీసుకునేలా ఏర్పాట్లు చేస్తామని, అంతర్జాతీయ కోచ్​ను నియమిస్తానని హామీ ఇచ్చారు. ఆ ప్రాంతంలో ఓ రోడ్డుకు కూడా లవ్లీనా పేరు పెడతామని చెప్పారు.

lovlina boxer
డీఎస్పీగా లవ్లీనా

పోలీస్​ శాఖకు ధన్యవాదాలు..

పోలీసు శాఖలో ఉద్యోగం రావడంపై హర్షం వ్యక్తం చేసింది బాక్సర్ లవ్లీనా. 'అసోం పోలీసు శాఖలో ఉద్యోగం రావడం ఆనందంగా ఉంది. కానీ, నా దృష్టంతా క్రీడలపై, పతకం గెలవడంపైనే ఉంటుంది. ప్రస్తుతం బాక్సింగ్ ట్రైనింగ్​పైనే పూర్తిస్థాయిలో దృష్టిపెడతాను. బాక్సింగ్​ నుంచి రిటైర్​ అయ్యాకే డ్యూటీలో చేరుతాను.' అని లవ్లీనా చెప్పింది.

lovlina boxer
అసోం పోలీసు శాఖలో బాక్సర్​ లవ్లీనా

ఇదీ చదవండి:

టీమ్​ఇండియా కీలక పదవిలో సచిన్.. జై షా రిక్వెస్ట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.