భారత 73వ చెస్ గ్రాండ్ మాస్టర్‌గా నిలిచాడు పద్నాలుగేళ్ల భరత్ సుబ్రమణియమ్. ఇటలీలో జరిగిన ఫైనల్ గ్రాండ్ మాస్టర్‌లో అవసరమైన పాయింట్లు సాధించి ఈ హోదా పొందాడు. చెన్నైకి చెందిన భరత్ 9 రౌండ్లలో 6.5 పాయింట్స్ సాధించాడు.
కటోల్లికాలో జరుగుతున్న చెస్ టోర్నీలో జీఎం హోదాకు అవసరమైన మూడో జీఎం నార్మ్‌ను అతడు అందుకున్నాడు. ఈ హోదా దక్కడానికి అవసరమైన 2,500 ఎలో రేటింగ్‌ను దాటాడు.
మరో భారతీయ ఆటగాడు ఎమ్ ఆర్ లలిత్ బాబు 7 పాయింట్లతో టోర్నీ విజేతగా నిలిచాడు. టై బ్రేక్ స్కోరు ఉత్తమంగా ఉన్నందున ఇతడు విజేత అయ్యాడు.
ఇదీ చదవండి: