మోకాలి గాయం ఓవైపు వేధిస్తున్నా సరే ఒలింపిక్స్‌లో పతకం గెలవడం గురించి భారత యువ రెజ్లర్ బజ్రంగ్ పూనియా మాట్లాడాడు. కాలు విరిగిన సరే పతకమైతే గెలవాలన్న కసితో కాంస్య పతక పోరులో ఆడాడని తెలిపాడు.
"ఒలింపిక్స్‌కు ముందు నా కుడి మోకాలికి గాయమైంది. అసలు విశ్వక్రీడల్లో ఆడటంపై సందిగ్ధత ఏర్పడింది. డాక్టర్ల సూచనలతో టోక్యోలో మ్యాచ్‌లు ఆడాను. వారు నా మోకాలికి పట్టీలు ఇచ్చారు.ప్లేఆఫ్‌కు మ్యాచ్‌లకు కాలికి పట్టీ ధరించి ఆడాల్సి వచ్చింది. దీనివల్ల నా ఫుట్‌వర్క్ కదలికలకు అడ్డంకి ఏర్పడింది. అందుకే సెమీస్‌లో ఓడిపోయాను. దీంతో కాంస్య పతక పోరులో నేను పట్టి లేకుండానే బరిలోకి దిగాలని నిశ్చయించుకున్నాను. కాలి గాయం ఎక్కువైనా సరే పతకమైతే గెలవాలనుకున్నా. చివరికి అది విరిగితే సర్జరీ చేయించుకోవడానికి సిద్ధపడ్డాను"
-బజ్రంగ్ పూనియా, భారత రెజ్లర్
ఒలింపిక్స్‌కు ముందు రష్యా వేదికగా జరిగిన అలీ అలియేవ్ టోర్నీ సందర్భంగా స్థానిక రెజ్లర్ అబుల్మాజిద్ కుదియేవ్తో పోరులో బజ్రంగ్ గాయపడ్డాడు. అతిపెద్ద ఈవెంట్‌కు ముందు గాయం బారిన పడటం వల్ల కొంత నిరాశకు లోనయ్యాడు. ఒలింపిక్స్‌లో చాలామంది ఒత్తిడి కారణంగానే ఓడిపోతుంటారు. దీంతో పతకం గెలవాలంటే ఒత్తిడిని దరిచేరనీయకూడదని పూనియా సంకల్పించాడు. ఆ సూత్రాన్ని విజయవంతంగా పాటించి టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించాడు.
ఇదీ చదవండి: Olympics 2021: నీరజ్‌కు స్వర్ణం వస్తే జర్మనీలో సంబరాలు