ETV Bharat / sports

రెజ్లింగ్​లో రెండోసారి అగ్రస్థానంలో భజరంగ్​ - nOMBER one

ప్రపంచ నంబర్ వన్​ ర్యాంకును మళ్లీ కైవసం చేసుకున్నాడు భారత రెజ్లర్ భజరంగ్ పూనియా. గత నవంబరులో తొలిసారి అగ్రస్థానానికి అందుకున్నాడు. ప్రస్తుతం చైనాలో జరగనున్న ఆసియన్ రెజ్లింగ్ ఛాంపియన్​షిప్​కు సన్నద్ధమవుతున్నాడు.

భజరంగ్ పూనియా
author img

By

Published : Apr 18, 2019, 10:58 AM IST

భారత రెజ్లర్ భజరంగ్​ పూనియా ప్రపంచ నంబర్ వన్​ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. యునైటెడ్ వరల్డ్​ రెజ్లింగ్​ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్​లో రెండోసారి అగ్రస్థానానికి ఎగబాకాడు. గత నవంబర్​లో తొలిసారి నంబర్ వన్​ ర్యాంకు కైవసం చేసుకున్న పూనియా.. 65 కేజీల విభాగంలో ఈ ఘనత సాధించాడు.

ఆసియా, కామన్​వెల్త్​ క్రీడల్లో సత్తా చాటి.. బంగారు పతకాలను తన ఖాతాలో వేసుకున్నాడు భజరంగ్. గత ఏడాది జరిగిన ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్​షిప్​లోనూ రజతం సాధించి 58 ర్యాంకింగ్​ పాయింట్లు తెచ్చుకున్నాడు.

ప్రస్తుతం భజరంగ్ ఏప్రిల్ 23 నుంచి చైనాలో జరగనున్న ఆసియన్ రెజ్లింగ్ ఛాంపియన్​షిప్​కు సన్నద్ధమవుతున్నాడు. గత నెలలో బల్గేరియాలో జరిగిన డాన్ కోలోవ్ - నికోలా పెట్రోవ్ టోర్నమెంటులో బంగారు పతకాన్ని గెలిచాడీ 25 ఏళ్ల రెజ్లర్.

Udhampur (J-K) Apr 17 (ANI): A newly-married couple arrived at a polling station in Udhampur to cast their votes for Lok Sabha elections 2019. They got married last night and early in the morning they exercised their right to vote. Couple arrived at polling station dressed in ceremonial attire. According to them, "Development will be the key issue".
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.