ETV Bharat / sports

Asian Para Games 2023 : పారా క్రీడల్లో భారత్‌ నయా రికార్డు.. 100 పతకాల దిశగా జర్నీ! - పారా ఆసియా క్రీడలు 2023 షెడ్యూల్

Asian Para Games 2023 : చైనా వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక పారా ఆసియా క్రీడల్లో మన భారత ప్లేయర్లు పతకాల మోత మోగిస్తున్నారు. ఈ క్రమంలో భారత్‌ ఓ కొత్త రికార్డు సృష్టించింది. ఇంతకీ అదేంటంటే ?

Asian Para Games 2023
Asian Para Games 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 27, 2023, 6:54 AM IST

Updated : Oct 27, 2023, 8:56 AM IST

Asian Para Games 2023 : పారా ఆసియా క్రీడల్లో మన భారత ప్లేయర్లు పతకల వేటను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో భారత్‌ ఓ సరికొత్త రికార్డును కూడా సృష్టించింది. ఇప్పటిదాకా 82 పతకాలు (18 స్వర్ణ, 23 రజత, 41 కాంస్యాలు) సొంతం చేసుకున్న భారత్​.. 2018 జకార్తా క్రీడల్లో నమోదైన 72 పతకాల రికార్డును బద్దలుకొట్టింది. గురువారం ఒక్కరోజే 19 పతకాలు (3 స్వర్ణ, 3 రజత, 13 కాంస్యాలు) ఇండియా ఖాతాలోకి చేరాయి. అయితే ఆటలు ముగియడానికి మరో రెండు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో వంద పతకాలు సాధించాలనే లక్ష్యంతో భారత్‌ ముందుకెళ్తోంది. ప్రస్తుతం 8వ స్థానంలో కొనసాగుతోంది.

మూడు స్వర్ణాలు సొంతం: సిద్ధార్థ్‌ బాబు (మిక్స్‌డ్‌ 50 మీటర్ల రైఫిల్‌ ప్రోన్‌), సచిన్‌ ఖిలారి (షాట్‌పుట్‌), షీతల్‌ దేవి-రాకేశ్‌ కుమార్‌ (ఆర్చరీ మిక్స్‌డ్‌ కాంపౌండ్‌) పసిడి పతకాలను ముద్దాడారు. షాట్‌పుట్‌లో 16.03 మీటర్లు గుండును విసిరిన సచిన్‌ అగ్రస్థానంలో నిలిచాడు. ఇదే విభాగంలో మరో భారత అథ్లెట్‌ రోహిత్‌కుమార్‌ (14.56 మీ) కూడా కాంస్యం నెగ్గాడు. 50 మీటర్ల ప్రోన్‌ షూటింగ్‌ విభాగంలో సిద్ధార్థ్‌ (247.7 పాయింట్లు) టాప్​ ప్లేస్​లో నిలిచి బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఆర్చరీ మిక్స్‌డ్‌ కాంపౌండ్‌ తుది పోరులో షీతల్‌-రాకేశ్‌ ద్వయం 151-149తో లిన్‌-గ్జిన్‌లియాంగ్‌ (చైనా)పై గెలుపొందింది. మోను (డిస్కస్‌త్రో), సిమ్రన్‌ (100 మీటర్లు), భాగ్యశ్రీ జాదవ్‌ (షాట్‌పుట్‌) రజతాలు సొంతం చేసుకున్నారు.

  • Dreams have wings even though they have no arms or legs. Sheetal Devi, 16-year-old archer from Team India, who became the first armless woman to win a medal at the Para World Archery Championships in July, claimed silver in Women's Doubles Compound with her teammate at Hangzhou… pic.twitter.com/K5kylcu6Ty

    — The 4th Asian Para Games Hangzhou Official (@19thAGofficial) October 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బ్యాడ్మింటన్‌లో జోరు: బ్యాడ్మింటన్‌లోనూ మన భారత షట్లర్లు సత్తా చాటారు. ఈ క్రీడలో మూడో రోజు 8 పతకాలు భారత్​ ఖాతాలో చేరాయి. శ్రీకాంత్‌ కదమ్‌ (సింగిల్స్‌), శివన్‌ నిత్య (సింగిల్స్‌), మనీషా రాందాస్‌ (సింగిల్స్‌, ఎస్‌యూ5), మాన్సిజోషి (సింగిల్స్‌), మన్‌దీప్‌ కౌర్‌-మనీషా రాందాస్‌ (మహిళల డబుల్స్‌), కృష్ణ సాగర్‌-శివరాజన్‌ (పురుషుల డబుల్స్‌, ఎస్‌హెచ్‌-6), ప్రమోద్‌ భగత్‌-సుకాంత్‌ (పురుషుల డబుల్స్‌), నిత్య-రచన (మహిళల డబుల్స్‌) సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. అదిల్‌-నవీన్‌ (ఆర్చరీ డబుల్స్‌), రతి హిమాంశి (చెస్‌), శ్రేయాంశ్‌ (100 మీ, టీ37), నారాయణ్‌ (100 మీ, టీ35) కాంస్యాలు నెగ్గారు.

Asian Para Games 2023 : ఆసియా పారా గేమ్స్​లో భారత్​ జోరు.. పసిడి సహా మరో రెండు పతకాలు

Para Asian Games 2023 : పారా ఆసియా క్రీడల్లో తెలుగు తేజాలు అదరహో.. భారత్ ఖాతాలో పసిడి జాతర!

Last Updated : Oct 27, 2023, 8:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.