ETV Bharat / sports

Asian Games 2023 India Medals : ఆసియా క్రీడల్లో అదరగొట్టిన భారత్​.. జావెలిన్ త్రో, ఆర్చరీలో రెండు స్వర్ణాలు కైవసం.. - సిల్వర్​ మెడల్​ సాధించిన హర్మిలన్ బెయిన్​

Asian Games 2023 India Medals : ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాల వేట కొనసాగుతోంది. జావెలిన్‌ త్రో విభాగంలోనే రెండు పతకాలు సొంతం చేసుకున్న భారత్‌ వంద పతకాలు సాధించాలనే లక్ష్యం దిశగా దూసుకుపోతోంది. 18 స్వర్ణాలతో ఇప్పటివరకూ భారత్‌ 81 పతకాలను కైవసం చేసుకుంది. అందరి అంచనాలను నిజం చేస్తూ స్టార్‌ జావెలిన్‌ త్రో అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా పసిడి పతకాన్ని సొంతం చేసుకుని సత్తా చాటాడు. ఇదే విభాగంలో నీరజ్‌కు గట్టి పోటీ ఇచ్చిన మరో భారత అథ్లెట్‌ కిశోర్‌కుమార్‌ జనా రజత పతకం సాధించాడు. అథ్లెటిక్స్‌ విభాగంలో సత్తా చాటిన భారత అథ్లెట్లు మరిన్ని పతకాలను ఇండియా ఖాతాలో వేశారు. ఫోర్‌ ఇన్‌టు 400 రిలేలో భారత్‌ స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఆర్చరీ మిక్స్ డ్ టీమ్ ఈవెంట్‌లో జ్యోతి సురేఖ-ఓజాస్ డియోటలే జోడి స్వర్ణంతో మెరిసింది.

Asian Games 2023 India Medals
Asian Games 2023 India Medals
author img

By PTI

Published : Oct 4, 2023, 5:34 PM IST

Updated : Oct 4, 2023, 7:24 PM IST

Asian Games 2023 India Medals : ఆసియా క్రీడల్లో భారత్ పతకాల పంట పండిస్తోంది. ఇప్పటివరకూ ఎప్పుడూ లేనంతగా పతకాలను సాధిస్తూ దూసుకుపోతోంది. 18 స్వర్ణాలు, 31 రజతాలు, 32 కాంస్యాలతో భారత్‌ ఇప్పటివరకూ 81 పతకాలను సాధించి పతకాల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. అందరి అంచనాలను నిజం చేస్తూ జావెలిన్‌ త్రోలో భారత స్టార్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా 88.88 మీటర్ల దూరం బల్లాన్ని విసిరి పసిడిని ముద్దాడాడు. ఇదే విభాగంలో నీరజ్‌కు గట్టిపోటీ ఇచ్చిన కిశోర్‌ కుమార్‌ జెనా కెరీర్‌ బెస్ట్‌ నమోదు చేస్తూ రజత పతకం కైవసం చేసుకున్నాడు. 86.77 మీటర్ల దూరం బల్లెం విసిరిన కిశోర్‌ చివరి వరకూ నీరజ్‌కు గట్టిపోటీనిచ్చాడు. ఆర్చరీ కాంపౌండ్ మిక్స్​డ్ టీమ్ ఈవెంట్‌లో జ్యోతి సురేఖ - ఓజాస్ డియోటలే జోడీ బంగారు పతకం సాధించింది. ఫైనల్లో దక్షిణ కొరియా జట్టును 159-158 తేడాతో భారత్ ఓడించింది. ఆసియా క్రీడల్లో ఆర్చరీలో భారత్‌కు ఇది రెండో స్వర్ణపతకం.

ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. 4x400 మీటర్ల రీలేలో భారత పురుష అథ్లెట్లు స్వర్ణంతో సత్తా చాటగా ఇదే విభాగంలో మహిళా అథ్లెట్లు రజత పతకం సాధించారు. పురుషుల 5 వేల మీటర్ల ఫైనల్‌లో అవినాశ్ ముకుంద్‌ సాబలే రజతం పతకం అందుకున్నాడు. 18 నిమిషాల 21.09 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని సాబలే రెండో స్థానంలో నిలిచాడు. ఆసియా క్రీడల్లో సాబలేకి ఇది రెండో పతకం. 3 వేల మీటర్ల పరుగులో అతడు ఇప్పటికే పసిడి గెల్చుకున్నాడు.

మహిళల 1500 మీటర్లలో రజతం గెలుచుకున్న హర్మిలన్‌ 800 మీటర్లలోనూ మరో రజతం సాధించింది. పురుషుల గ్రీకో-రోమన్ రెజ్లింగ్‌ 87 కేజీల విభాగంలో సునీల్ కుమార్ కాంస్య పతకం సాధించాడు. గ్రీకో-రోమన్‌ రెజ్లింగ్‌ విభాగంలో భారత్‌కు పతకం దక్కడం ఇదే తొలిసారి. హాకీలో భారత పురుషుల జట్టు సెమీస్‌లో కొరియాను 5-3 తేడాతో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లి పతకాన్ని ఖరారు చేసింది. బ్రిడ్జిలో చైనాను మట్టికరిపించి ఫైనల్‌ చేరిన భారత్‌ కనీసం రజతాన్ని ఖాయం చేసింది. బాక్సింగ్‌లో ఒలింపిక్‌ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్‌ రజతంతో సరిపెట్టుకుంది. లవ్లీనా ఓటమితో ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ల పోరాటం స్వర్ణ పతకం లేకుండానే ముగిసింది. ఒక రజతం, నాలుగు కాంస్యాలతో భారత బాక్సర్లు మొత్తం 5 పతకాలు సాధించారు.

హాకీలో భారత్​ ఫైనల్​కు..
ఆసియా క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు అదరగొట్టింది. సెమీఫైనల్​లో దక్షిణకొరియాను 5-3 తేడాతో ఓడించి ఫైనల్​కు చేరింది. ఈ మ్యాచ్​లో ఐదో నిమిషంలో భారత జట్టు తొలి గోల్‌ చేసింది. అనంతరం 11వ నిమిషంలో మరో గోల్ చేసింది. దీంతో ఈ మ్యాచ్‌లో భారత జట్టు 2-0తో ముందుకు దూసుకెళ్లింది.

ఆ తర్వాత 15వ నిమిషంలో భారత్‌ మూడో గోల్‌ చేయగా.. 17వ నిమిషంలో దక్షిణ కొరియా తొలి గోల్‌ చేసింది. ఆ తర్వాత 20వ నిమిషంలో దక్షిణ కొరియా రెండో గోల్‌ చేసింది. అయితే ఈ సమయంలో భారత్​ 3-2తో ముందంజలో ఉంది. ఆ తర్వాత భారత ఆటగాళ్లు దూకుడుగా ఆడి మంచి ప్రదర్శనను చూపించారు. మళ్లీ 24వ నిమిషంలో భారత్‌కు నాలుగో గోల్‌ వచ్చింది. దీంతో భారత జట్టు 4-2తో ఆధిక్యంలో ఉంది. ఆ తర్వాత దక్షిణ కొరియా మరోసారి ఎదురుదాడికి దిగింది. 42వ నిమిషంలో దక్షిణ కొరియా గోల్ చేసింది. దీంతో స్కోరు 4-3గా మారింది. భారత జట్టు ఆధిక్యం చెక్కుచెదరలేదు. అంతేకాకుండా.. 54వ నిమిషంలో భారత్‌ ఐదో గోల్‌ చేసింది. దీంతో మ్యాచ్‌లో భారత జట్టు 5-3తో ముందంజ వేసింది. చివర్లో భారత్​.. దక్షిణ కొరియా ఆటగాళ్లకు గోల్స్ చేసే అవకాశం ఇవ్వకుండా.. మంచి ప్రదర్శన చూపించారు. దీంతో భారత జట్టు 5-3తో దక్షిణ కొరియాను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.

Asian Games 2023 Medals list : ఆర్చరీలో తొలి స్వర్ణం.. 2018 మెడల్స్​ రికార్డు బద్దలు..

Virat Kohli World Cup 2023 : నెట్టింట విరుష్క పోస్ట్​.. ఆ విషయాన్ని అడిగి విసిగించవద్దంటూ స్పెషల్​ రిక్వెస్ట్​..

Last Updated : Oct 4, 2023, 7:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.