ETV Bharat / sports

ఆసియా గేమ్స్​లో​ భారత చెస్​ టీమ్​ మెంటార్​గా ఆనంద్

author img

By

Published : Jan 29, 2022, 7:06 PM IST

Updated : Jan 29, 2022, 7:17 PM IST

Asian Games 2022: ఈ ఏడాది ఆసియా గేమ్స్​ దృష్ట్యా భారత చెస్ అటగాళ్లను పోటీకి సిద్ధం చేస్తోంది ఆల్​ ఇండియా చెస్ ఫెడరేషన్. ఈ మేరకు చెస్​ దిగ్గజం విశ్వనాథన్​ ఆనంద్​కు కీలక బాధ్యతలు అప్పగించింది.

vishwanathan anand
విశ్వనాథన్ ఆనంద్

Asian Games 2022: ఈ ఏడాది ఆసియా గేమ్స్​ పోటీలు మరికొన్ని నెలల్లో ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆల్​ ఇండియా చెస్ ఫెడరేషన్​(ఏఐసీఎఫ్).. ఆటగాళ్లను పోటీకి సిద్ధం చేస్తోంది. భారత చెస్ టీమ్​ ఎలాగైనా పతకాలు సాధించాలని ఆశిస్తున్న ఏఐసీఎఫ్.. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్​ను మెంటార్​గా నియమించింది.

"భారత ఆటగాళ్లు ఆసియా గేమ్స్​లో నాలుగు స్వర్ణ పతకాలు సాధించాలని ఆశిస్తున్నాం. ఇందుకోసం విశ్వనాథన్​ ఆనంద్​కు మెంటార్​ బాధ్యతలు అప్పగించాం. ఈ మేరకు పురుష, మహిళ ఆటగాళ్లతో ఆనంద్​ తొలి సెషన్​ వచ్చే గురువారం జరగనుంది." అని ఏఐసీఎఫ్ అధికారి తెలిపారు.

2010 గువాంగ్​ఝౌ గేమ్స్​లో భారత్​ రెండు కాంస్య పతకాలు మాత్రమే సాధించింది. ఈ నేపథ్యంలో 2022 ఆసియా గేమ్స్​ దృష్ట్యా ఏఐసీఎఫ్ అప్రమత్తమైంది. పురుషుల టీమ్​ కోసం 10 మందిని, మహిళల టీమ్​ కోసం 10 మందిని ఎంపిక చేస్తున్నట్లు పేర్కొంది. అయితే.. వీరిలో అంతిమంగా జట్టుకు ఐదుగురు మాత్రమే మిగులుతారు. ఈ జాబితాను సెలక్షన్ కమిటీ ఏప్రిల్​లో ప్రకటిస్తుంది. అభిజిత్ కుంటే, దిబేయాందు బారువా, దినేష్​ శర్మ సెలక్షన్​ కమిటీ సభ్యులుగా ఉన్నారు.

ఆసియా గేమ్స్​లో భాగంగా.. సెప్టెంబర్ 11 నుంచి చెస్​ ఈవెంట్స్​ ప్రారంభంకానుండగా.. రెండు ఫార్మాట్లలో పోటీలు జరగనున్నాయి. పురుషుల, మహిళల సింగిల్స్ సెప్టెంబర్ 11 నుంచి 14 వరకు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 16-24 మధ్య ఐదుగురు సభ్యులతో కూడిన పోటీలు జరగనున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:

PV Sindhu: సింధు.. ఈ ఏడాది ఆ లెక్క సరిచేస్తుందా?

ఆసియా గేమ్స్​లో క్రికెట్.. 11 ఏళ్ల తర్వాత..

Last Updated : Jan 29, 2022, 7:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.