Asian Championship Trophy Final Match : ఆసియా ఛాంపియన్స్‌షిప్ 2023 హాకీ విజేతగా ఇండియా అవతరించింది. శనివారం చెన్నై వేదికగా హోరాహోరీగా సాగిన ఫైనల్స్‌లో మలేసియాతో తలపడ్డ భారత్ 4-3 తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసి గెలిచింది. ఈ టైటిల్ గెలవడం ద్వారా భారత్ ఖాతాలో నాలుగో ఆసియా హాకీ టైటిల్ వచ్చి చేరింది. అంతకుముందు... సెమీల్లో జపాన్‌తో తలపడ్డ భారత్ 5 -0 తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది.
Ind Vs Pak Hockey 2023 : ఈ మ్యాచ్‌ను హర్మన్‌ప్రీత్ సింగ్ టీమ్ మెరుగ్గానే ప్రారంభించింది. 9వ నిమిషంలో జుగ్‌రాజ్ పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసుకుని అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాడు. అయితే మలేసియా చూపించిన దూకుడు వల్ల స్టేడియం కాసేపు మూగబోయింది. చూస్తుండగానే ఆ జట్టు 3-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మొదట అబుకమల్ (14వ), రహీమ్ (18వ) స్వల్ప వ్యవధిలో బంతిని నెట్‌లోకి పంపగా.. ఆ తర్వాత అమీనుద్దీన్ (28వ) గోల్ చేసి మలేసియా జట్టును తిరుగులేని స్థితిలో నిలిపాడు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన భారత్.. తమకొచ్చిన అవకాశాలను వృథా చేసుకుంది.
-
#WATCH | "The match was awesome. India rocks," say hockey fans after India beat Malaysia 4-3 to clinch the Asian Champions Trophy in Chennai. pic.twitter.com/Knb5zmIudY
— ANI (@ANI) August 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | "The match was awesome. India rocks," say hockey fans after India beat Malaysia 4-3 to clinch the Asian Champions Trophy in Chennai. pic.twitter.com/Knb5zmIudY
— ANI (@ANI) August 12, 2023#WATCH | "The match was awesome. India rocks," say hockey fans after India beat Malaysia 4-3 to clinch the Asian Champions Trophy in Chennai. pic.twitter.com/Knb5zmIudY
— ANI (@ANI) August 12, 2023
Asian Championship Hockey Final : అయితే మూడో క్వార్టర్ ఆఖరికి వచ్చినప్పటికీ గోల్స్ పడకపోవడం వల్ల ఆతిథ్య జట్టుకు ఓటమి తప్పదేమో అనిపించింది. కానీ ఆ క్వార్టర్ చివరిలో అద్భుతమే జరిగింది. 45వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్‌ను హర్మన్‌ప్రీత్ గోల్ కొట్టి స్కోరు లోటును 2-3కు మార్చగా.. అదే నిమిషంలో గుర్జాంత్ ఓ మెరుపు గోల్ సాధించి 3-3తో స్కోరు సమం చేశాడు. ఈ క్రమంలో వరుసగా రెండు గోల్స్ సమర్పించుకుని డీలాపడిన మలేసియాను ముంచుతూ ఆకాశ్‌దీప్ (56వ) ఓ తెలివైన షాట్‌తో భారత్‌ను విజయపథంలోకి నడిపించాడు. ఆఖరిదాకా ఆధిక్యాన్ని కాపాడుకున్న భారత్ విజయాన్ని అందుకుంది. కాగా జట్టుకు ఇది నాలుగో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ.
India Vs Pakistan Hockey 2023 : మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ సౌత్ కొరియాకు కనీసం కాంస్యం కూడా దక్కలేదు. అయితే మూడో స్థానం కోసం జరిగిన పోరులో జపాన్ 5-3 గోల్స్‌తో కొరియాను కంగు తినిపించింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన జపాన్.. తన ప్రత్యర్థిని ఒత్తిడికి గురి చేసింది. సుమారు 30 నిమిషాల్లోపే ఆ జట్టు మూడు గోల్స్‌ను కొట్టేసింది. రియోమా (3వ), రియోసి కాటో (9వ), కెంటారో (28వ) బంతిని లక్ష్యానికి చేర్చి జపాన్‌ను ఆధిక్యంలో నిలిపారు. అయితే వేగం పుంజుకున్న కొరియా కూడా గట్టిగానే ప్రతిఘటించింది. జోంగ్‌యాన్ (15వ), పార్క్ (26వ) గోల్స్‌తో 2-3తో ప్రత్యర్థి చేరువలోకి వచ్చింది.అయితే ఆ తర్వాత జోంగ్‌యాన్ (33వ) మరో గోల్ కొట్టడం వల్ల 3-3తో స్కోరు సమం చేసింది. కానీ కాసేపట్లో మ్యాచ్ ముగుస్తుందనగా విజృంభించిన జపాన్... షాటో (53వ), నగాయోషి (58వ) గోల్స్‌తో విజయాన్ని ఖాయం చేసుకుంది.
-
The #ChakdeIndia Moment is here FINALLY! 🎉
— SAI Media (@Media_SAI) August 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
After defeating 🇲🇾 4-3 in an absolute thriller finale, Team 🇮🇳 becomes the #AsianChampionsTrophy Winner of 2023 🥳
Congratulations on claiming the 🏆🥳 for 4⃣th time
Kudos to our Men in 🔵 👏👏
More power to you guys💪🏻 pic.twitter.com/FrmpbGLJHt
">The #ChakdeIndia Moment is here FINALLY! 🎉
— SAI Media (@Media_SAI) August 12, 2023
After defeating 🇲🇾 4-3 in an absolute thriller finale, Team 🇮🇳 becomes the #AsianChampionsTrophy Winner of 2023 🥳
Congratulations on claiming the 🏆🥳 for 4⃣th time
Kudos to our Men in 🔵 👏👏
More power to you guys💪🏻 pic.twitter.com/FrmpbGLJHtThe #ChakdeIndia Moment is here FINALLY! 🎉
— SAI Media (@Media_SAI) August 12, 2023
After defeating 🇲🇾 4-3 in an absolute thriller finale, Team 🇮🇳 becomes the #AsianChampionsTrophy Winner of 2023 🥳
Congratulations on claiming the 🏆🥳 for 4⃣th time
Kudos to our Men in 🔵 👏👏
More power to you guys💪🏻 pic.twitter.com/FrmpbGLJHt
Asian Champions Trophy : జపాన్‌పై భారత్ ఘన విజయం.. ఫైనల్లో మలేసియాతో 'ఢీ'
Ind Vs Pak Hockey 2023 : ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ.. పాక్‌పై భారత్ ఘన విజయం..
నాలుగోసారి ఆసియాకప్ ఛాంపియన్‌గా భారత్.. ఫైనల్లో పాక్ చిత్తు