ఆసియా అండర్-23 వాలీబాల్ టైటిల్‌ను తృటిలో చేజార్చుకున్నా... అద్భుత ప్రదర్శనతో దేశానికి గర్వకారణంగా నిలిచారని భారత జట్టును మెచ్చుకున్నారు క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజుజు.
" ఫైనల్లో మీరు పోరాడిన తీరు అమోఘం. రజతం గెలిచి దేశానికి గర్వకారణంగా నిలిచారు. టోర్నీ మొత్తం మీరు చూపించిన ఆటతీరుకు అభినందనలు".
--కిరణ్ రిజుజు, క్రీడాశాఖ మంత్రి
ఆసియా అండర్-23 ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఆదివారం చైనీస్ తైపీతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఓటమిపాలైంది భారత జట్టు. మయన్మార్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత క్రీడాకారులు రెండో స్థానానికి పరిమితమయ్యారు.
చైనీస్ తైపీ జట్టుతో నాలుగు సెట్లు జరిగిన మ్యాచ్‌లో... తొలి రెండు సెట్లను 21-25, 20-25 తేడాతో కోల్పోయింది భారత్. ముడో సెట్లో జోరు చూపించి 25-19 తేడాతో నెగ్గారు. కచ్చితంగా గెలిస్తే డ్రా అయ్యే చివరి సెట్లో పోరాడి 23-25 తేడాతో ఓడిపోయింది భారత వాలీబాల్ జట్టు.
టోర్నీ మొత్తం అద్భుత పోరాటం చేసి... హేమాహేమీలైన చైనా, న్యూజిలాండ్, కజికిస్థాన్, పాకిస్థాన్‌ను ఓడించి తొలిసారి ఫైనల్ చేరారు. ఈ టోర్నీలో ఫైనల్ చేరడం ద్వారా భారత్.. ఎఫ్‌ఐవీబీ ప్రపంచ పురుషుల అండర్-23 ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది.
ఇవీ చూడండి...భారత మహిళా జట్టుకు 'ఫెయిర్ ప్లే ట్రోఫీ'