ETV Bharat / sports

ఫిఫా ప్రపంచకప్​ ఫైనల్లో అడుగు పెట్టేదెవరో? సెమీస్​లో అర్జెంటీనాతో క్రొయేషియా ఢీ - క్రొయేషియా వర్సెస్​ అర్జెంటీనా మ్యాచ్​

నాలుగేళ్ల క్రితం.. ఎలాంటి అంచనాలు లేకుండా అడుగుపెట్టి.. సంచలన ప్రదర్శనతో ఫైనల్‌ చేరినా కప్పు చిక్కలేదు. ఈ సారి అదే కసితో.. అగ్రశ్రేణి జట్లకు షాకిస్తూ.. ప్రపంచకప్‌ కోసం పట్టుదలతో పయనిస్తోంది క్రొయేషియా. కప్పు కోసం ఆఖరి వేటకు అర్హత సాధించేందుకు ఈ రెండు జట్లు సై అంటున్నాయి. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగే సెమీస్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. అర్జెంటీనానే ఫేవరెట్‌గా కనిపిస్తున్నా.. క్రొయేషియాను తక్కువ అంచనా వేయలేం.మరి ఫైనల్లో అడుగు పెట్టేదెవరో?

FIFA World Cup 2022
FIFA World Cup 2022
author img

By

Published : Dec 13, 2022, 7:27 AM IST

FIFA World Cup 2022 : ఫుట్‌బాల్‌లో మేటి ఆటగాడిగా ఎదిగినా.. ప్రపంచకప్‌ కల కోసం సుదీర్ఘ పోరాటం కొనసాగిస్తున్నాడు మెస్సి. ఇప్పుడు చిట్టచివరి ప్రయత్నంలో కప్పును ముద్దాడేందుకు సాగుతున్న అతనితో పాటు అడుగేస్తూ.. దేశాన్ని మూడోసారి విశ్వవిజేతగా నిలపాలనే లక్ష్యంతో ఉంది అర్జెంటీనా.అంచనాలకు అందకుండా.. షాక్‌ల మీద షాక్‌లతో సాగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో సెమీస్‌ పోరుకు సమయం ఆసన్నమైంది. నేడు అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగే తొలి సెమీస్‌లో మాజీ ఛాంపియన్‌ అర్జెంటీనాతో క్రొయేషియా తలపడుతుంది.

గత రెండు ప్రపంచకప్‌ల్లో ఒక్కోసారి (2014లో అర్జెంటీనా, 2018లో క్రొయేషియా) రన్నరప్‌గా నిలిచిన ఈ రెండు జట్ల పోరు ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్పటికే రెండు సార్లు (1978, 1986) ఛాంపియన్‌ అర్జెంటీనా మ్యాచ్‌లో ఫేవరెట్‌ అనడంలో సందేహం లేదు. ఈ కప్పు చరిత్రలో సెమీస్‌లో ఆ జట్టుకు ఓటమన్నదే లేదు. మరోవైపు ఆరో ప్రపంచకప్‌ ఆడుతున్న క్రొయేషియా.. అసాధారణ ప్రదర్శన కొనసాగించాలనే లక్ష్యంతో ఉంది. గత ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలో 3-0తో అర్జెంటీనాపై గెలిచిన ఆ జట్టు.. మరోసారి అదే ప్రదర్శన పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉంది. లూసాయిల్‌ స్టేడియంలో ఎవరి జెండా ఎగురుతుందో?

ఆశలన్నీ అతనిపైనే..
కోపా అమెరికా టైటిల్‌ గెలిచి.. వరుసగా 36 మ్యాచ్‌ల్లో ఓటమన్నదే లేకుండా ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన అర్జెంటీనాకు తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా షాకిచ్చింది. ఆ ఓటమి నుంచి తేరుకుని, బలంగా పుంజుకుని ఆ జట్టు సెమీస్‌ చేరడంలో కెప్టెన్‌ మెస్సీది కీలక పాత్ర. ఇప్పటికే నాలుగు గోల్స్‌ చేసిన అతను.. టోర్నీలో అత్యధిక గోల్స్‌ చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.

సహచరులు రెండు గోల్స్‌ చేయడంలోనూ అతను సాయపడ్డాడు. సెమీస్‌లోనూ జట్టు ఆశలన్నీ అతనిపైనే. ఎదురుగా ఎంతమంది ప్రత్యర్థి ఆటగాళ్లు ఉన్నా.. బంతిని డ్రిబ్లింగ్‌ చేస్తూ, అందరినీ తప్పిస్తూ గోల్స్‌ కొట్టడంలో అతనికి లేదు పోటీ. క్వార్టర్స్‌లో నెదర్లాండ్స్‌తో పోరులో ఆటతోనే కాదు మైదానంలో ఆవేశంతోనూ చర్చనీయాంశంగా మారాడు.

ఆ మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్లో గెలిచిన అర్జెంటీనా.. సెమీస్‌లో క్రొయేషియాకు చెక్‌ పెట్టాలంటే డిఫెన్స్‌లో మరింత మెరుగవాల్సి ఉంది. ఆ జట్టుకు మరో బలం గోల్‌కీపర్‌ ఎమిలియానో మార్టినెజ్‌. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో మొదట రెండు గోల్స్‌ ఆపలేకపోయినప్పటికీ షూటౌట్లో మాత్రం గొప్ప ప్రదర్శనతో జట్టును గెలిపించాడు. అల్వరెజ్‌, ఫెర్నాండెజ్‌, అలిస్టర్‌, డి మారియా, మొలీనా కూడా చూడదగ్గ ఆటగాళ్లు. రెండు పసుపు కార్డులు అందుకున్నందుకు గొంజాలో మోంటియల్‌, మార్కస్‌ అకూనా ఈ మ్యాచ్‌కు దూరమవుతున్నారు.

మరో సంచలనానికి..

  • ప్రపంచకప్‌లో స్ఫూర్తిదాయక ప్రదర్శన కొనసాగిస్తున్న క్రొయేషియా మరో సంచలనంతో ఫైనల్‌ బెర్తు పట్టేయాలని చూస్తోంది. క్వార్టర్స్‌లో బ్రెజిల్‌కు షాకిచ్చి.. నెయ్‌మార్‌ కప్పు ఆశలను కూల్చిన ఆ జట్టు.. ఇప్పుడు మెస్సి కలను అడ్డుకునేందుకు సిద్ధమైంది. ఆ జట్టులోనూ కెప్టెన్‌ లూకా మోద్రిచ్‌ ప్రధాన ఆటగాడు. ఇప్పటివరకూ టోర్నీలో అతను ఒక్క గోల్‌ కొట్టకున్నా, గోల్‌ చేయడంలో సాయపడకున్నా.. అతణ్ని తక్కువగా వేయలేం.
  • మిడ్‌ఫీల్డ్‌లో చురుగ్గా కదులుతూ.. బంతిపై జట్టు నియంత్రణ కొనసాగేలా చూడడంలో అతనే కీలకం. అతనితో పాటు కొవాసిచ్‌, బ్రోజోవిచ్‌తో మిడ్‌ఫీల్డ్‌ పటిష్ఠంగా ఉంది. క్రమారిచ్‌, మార్కో, లోవ్రో, పెరిసిచ్‌, పెట్కోవిచ్‌, మిస్లావ్‌ కూడా సత్తాచాటేందుకు సై అంటున్నారు. గోల్‌కీపర్‌ డొమినిక్‌ లివకోవిచ్‌ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి.
  • ప్రపంచకప్‌ల్లో క్రొయేషియా ఇప్పటివరకూ ఆడిన నాలుగు పెనాల్టీ షూటౌట్లలోనూ గెలిచింది. 2018లో ప్రిక్వార్టర్స్‌లో డెన్మార్క్‌పై, క్వార్టర్స్‌లో రష్యాపై, ఈ సారి ప్రి క్వార్టర్స్‌లో జపాన్‌పై, క్వార్టర్స్‌లో బ్రెజిల్‌పై షూటౌట్లోనే నెగ్గింది. ఆ నాలుగింటిలోనూ గోల్‌పోస్టుకు అడ్డుగోడలా నిలబడి డొమినిక్‌ జట్టును గెలిపించాడు.
  • సెమీస్‌లో మెస్సీని అడ్డుకోవడంపై ఆ జట్టు ప్రధానంగా దృష్టి సారిస్తుందనడంలో సందేహం లేదు. బ్రెజిల్‌తో మ్యాచ్‌లో విజయమే కాకుండా, జట్టు ఆటతీరు కూడా క్రొయేషియా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. మ్యాచ్‌ పెనాల్టీ షూటౌట్‌కు దారితీస్తే మాత్రం క్రొయేషియాకే ఎక్కువ విజయావకాశాలు ఉంటాయని చెప్పొచ్చు.

1 ప్రపంచకప్‌ నాకౌట్లో ఈ రెండు జట్లు తలపడుతుండడం ఇదే తొలిసారి.

  • ప్రపంచకప్‌ల్లో క్రొయేషియాకు ఇది మూడో సెమీస్‌. 1998 (మూడో స్థానం), 2018 (రన్నరప్‌)లో ఆ జట్టు సెమీస్‌ ఆడింది.

4 ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ మెస్సి చేసిన గోల్స్‌. ఒలివర్‌ గిరూడ్‌ (ఫ్రాన్స్‌)తో కలిసి అతను రెండో స్థానంలో ఉన్నాడు. ఎంబపె (ఫ్రాన్స్‌) 5 గోల్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

  • ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ క్రొయేషియా పెనాల్టీ షూటౌట్లు. అన్నింటిలోనూ ఆ జట్టు నెగ్గింది.
  • అర్జెంటీనాకిది అయిదో సెమీస్‌. 1930 (రన్నరప్‌), 1986 (ఛాంపియన్‌), 1990 (రన్నరప్‌), 2014 (రన్నరప్‌)లో సెమీస్‌ ఆడిన ఆ జట్టు ఆ మ్యాచ్‌లన్నింటిలో గెలిచింది. 1978లో ఆ జట్టు ఛాంపియన్‌గా నిలిచినప్పటికీ అప్పటి ఫార్మాట్‌ ప్రకారం రెండో రౌండ్లో అగ్రస్థానంతో నేరుగా ఫైనల్‌ చేరింది. సెమీస్‌ లేదు.

5 ఇప్పటివరకూ ఈ రెండు జట్లు తలపడ్డ మ్యాచ్‌లు. అర్జెంటీనా, క్రొయేషియా చెరో రెండు సార్లు గెలిచాయి. ఓ మ్యాచ్‌ డ్రా అయింది. ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో అర్జెంటీనా (1998), క్రొయేషియా (2018) చెరోసారి నెగ్గాయి.

argentina-vs-croatia-semi-final-fifa-world-cup-2022
సెమీస్​కు ఎలా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.