ETV Bharat / sports

షూటింగ్ ప్రపంచకప్​లో స్వర్ణం నెగ్గిన అపూర్వీ - స్వర్ణం

ఐఎస్​ఎస్​ఎఫ్ ప్రపంచకప్​లో భారత షూటర్​ అపూర్వీ స్వర్ణం గెలుచుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్​లో 251 పాయింట్లు సాధించి పసిడిని కైవసం చేసుకుంది. ఫిబ్రవరిలో దిల్లీలో జరిగిన ప్రపంచకప్​లోనూ బంగారు పతకాన్ని నెగ్గింది అపూర్వీ.

అపూర్వీ
author img

By

Published : May 26, 2019, 7:55 PM IST

జర్మనీ మ్యూనిక్​​ నగరంలో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ఐఎస్ఎస్​ఎఫ్​) ప్రపంచకప్​లో భారత షూటర్​ స్వర్ణం నెగ్గింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్​లో అపూర్వీ చండేలా బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.

తుదిపోరులో 251 పాయింట్ల సాధించిన ఈ జైపుర్ షూటర్..అగ్రస్థానంలో నిలిచింది. చైనాకు చెందిన వాంగ్ లుయో 250.8 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజతంతో సరిపెట్టుకుంది. మరో చైనీస్ షూటర్ గ్జూ హాంగ్ 229.4 పాయింట్లతో కాంస్యాన్ని సాధించింది.

ఫిబ్రవరిలో దిల్లీ వేదికగా జరిగిన ఐఎస్​ఎస్ఎఫ్​ ప్రపంచకప్​లోనూ అపూర్వీ స్వర్ణాన్ని చేజిక్కించుకుంది. ఒకే ఏడాది వరల్డ్​కప్​లో రెండు స్వర్ణాల నెగ్గిన షూటర్​గా అపూర్వీ ఘనత సాధించింది. ఇప్పటికే 2020 టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించిందీ జైపుర్ షూటర్​. అపూర్వీతో పాటు సౌరభ్ చౌదురీ, అభిషేక్ వర్మ, దివ్యాంశ్ సింగ్ పన్వార్​లు టోక్యో ఒలింపిక్స్​లో చోటు దక్కించుకున్నారు.

Visakhapatnam (Andhra Pradesh), May 25 (ANI): Central Industrial Security Force (CISF) on Friday recovered a hunting knife from a man at the Visakhapatnam Airport. Authorities found the hunting knife from his bag while he was entering the airport from the parking area. CISF handed over the person to the Airport police which have detained him and started investigation in the case.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.