ETV Bharat / sports

బాక్సింగ్ ఛాంపియన్​షిప్​ ఫైనల్లోకి పంగాల్, శివ - shiva thapa

బాక్సింగ్ ఛాంపియన్​షిప్స్​ పోటీల సెమీఫైనల్లో భారత బాక్సర్లు​ అమిత్ పంగాల్, శివ థాప సత్తా చాటారు. ఈ ఇద్దరూ ఫైనల్లోకి అడుగు పెట్టారు. మరో బాక్సర్ వారిందర్ సింగ్ సెమీస్​లో ఓటమితో కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు.

amit pangal, indian boxer
అమిత్ పంగాల్, భారత బాక్సర్
author img

By

Published : May 28, 2021, 9:46 PM IST

Updated : May 28, 2021, 10:21 PM IST

దుబాయ్ వేదికగా జరుగుతోన్న బాక్సింగ్ ఛాంపియన్​షిప్స్​ పోటీల్లో భారత బాక్సర్లు సత్తా చాటారు. అమిత్ పంగాల్​(52 కేజీ), శివ థాప(64 కేజీ).. ఫైనల్లోకి దూసుకెళ్లారు.

పంగాల్​.. కజకిస్థాన్​ బాక్సర్ సాకెన్​ బిబోస్సినోవ్​పై 5-0 తేడాతో విజయం సాధించాడు. వీరిద్దరూ గతంలో ప్రపంచ ఛాంపియన్​షిప్​లో తలపడగా.. పంగాల్​నే విజయం వరించింది. వరుస పిడిగుద్దులతో ప్రత్యర్థికి ఎక్కడా అవకాశం ఇవ్వలేదు పంగాల్​. ఈ పోటీల్లో వరుసగా ఐదో పతకాన్ని సాధించిన తొలి భారత బాక్సర్​గా​ శివ థాప ఘనత వహించాడు. 2013లో స్వర్ణంతో మెరిసిన శివ, 2015, 2019లో కాంస్య పతకం గెలుపొందాడు. 2017లో సిల్వర్​ మెడల్​ను కైవసం చేసుకున్నాడు. తజకిస్థాన్​కు చెందిన బాక్సర్​ బఖోదుర్​ ఉస్మోనోవ్​పై 4-0తో గెలుపొందాడు.

జాతీయ ఛాంపియన్​ వారిందర్ సింగ్(60 కేజీ).. సెమీస్​లో ఓడిపోయాడు. ఇరాన్ బాక్సర్​ దనియల్ షాబాక్ష్​ 2-3తో వారిందర్​పై విజయాన్ని నమోదు చేశాడు. దీంతో అతనికి కాంస్య పతకం లభించనుంది.

గురువారం రాత్రి జరిగిన మ్యాచ్​ల్లో నలుగురు మహిళా బాక్సర్లు ఫైనల్​కు చేరుకున్నారు. ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్​ మేరీ కోమ్​తో పాటు లల్బుత్​సైహి, పుజా రాణి, అనుపమ తుదిపోరులో తలపడనున్నారు.

సాక్షి చౌదరి ఓటమి..

రెండు సార్లు ప్రపంచ యువ ఛాంపియన్​ సాక్షి చౌదరి(54 కేజీ).. ఫైనల్​లో తలవంచింది. కజకిస్థాన్​ బాక్సర్​ దినా జోలామన్​.. 3-2తో సాక్షిపై విజయం సాధించింది.

ఇదీ చదవండి: ఆసియా​ ఛాంపియన్​షిప్​ ఫైనల్​లో మేరీకోమ్, సాక్షి​

Last Updated : May 28, 2021, 10:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.