దుబాయ్ వేదికగా జరుగుతోన్న ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అమిత్ పంగాల్(52 కిలోలు)కు నిరాశే మిగిలింది. సోమవారం టోర్నీ ఫైనల్లో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన షాఖోబిదిన్ జోయిరోవ్పై 2-3 తేడాతో ఓటమి పాలయ్యాడు. తుది పోరులో ఓటమిపాలైన అమిత్ పంగాల్‌కు రజత పతకం దక్కింది.
మ్యాచ్ ఫలితంపై రివ్యూ
అయితే ఈ మ్యాచ్‌లో అమిత్ పంగాల్ ఓటమిపై భారత్ రివ్యూ కోరింది. మ్యాచ్‌లోని రెండో రౌండ్లో అమిత్ పంగాల్‌కు రావాల్సిన పాయింట్లపై రివ్యూ కోరినట్లు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ట్వీట్ చేసింది.
ఇదీ చూడండి: ఆసియా ఛాంపియన్‌షిప్‌లో మేరీకోమ్‌కు రజతం