అమెరికా యువ స్ప్రింటర్ మైకెల్ నార్మన్ 100 మీటర్ల పరుగులో తన అత్యుత్తమ ప్రదర్శన కనబరచాడు. స్థానికంగా జరిగిన ఓ రేసును అతను 9.86 సెకన్లలో ముగించాడని ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య పేర్కొంది. ఈ ఏడాది 100 మీటర్లలో ఇదే అత్యుత్తమ ప్రదర్శన.
నాలుగేళ్ల తర్వాత...
22 ఏళ్ల నార్మన్ 2016 తర్వాత 100మీ. పరుగులో పాల్గొనడం ఇదే తొలిసారి. 100మీ. పరుగును 10 సెకన్లలోపు, 200మీ. పరుగును 20 సెకన్లలోపు, 400మీ. పరుగును 44 సెకన్లలోపు పూర్తి చేసిన రెండో స్ప్రింటర్ నార్మన్. ఆ జాబితాలో అతనికంటే ముందు దక్షిణాఫ్రికా 400మీ. పరుగు ఒలింపిక్ ఛాంపియన్ వాన్ నికెర్క్ ఉన్నాడు.
2009లో 100 మీటర్ల పరుగును 9.58 సెకన్లలో పూర్తి చేశాడు ఉసేన్ బోల్ట్. ఇదే ఇప్పటికీ కొనసాగుతున్న ప్రపంచ రికార్డు.