ETV Bharat / sports

హిమ పాతంలో ఇరుక్కుని ఛాంపియన్​​ స్కీయర్ మృతి​.. షాక్​లో అభిమానులు..! - కైల్‌ స్మెయిన్‌ స్కీయింగ్​ స్టార్

జపాన్‌లోని మంచు పర్వాతాల్లో జరిగిన ఓ ప్రమాదంలో అమెరికాకు చెందిన స్టార్​ స్కీయర్ కైల్​ స్మెయిన్​ మృతి చెందాడు. కాగా ఓ యాడ్​ షూట్​ కోసం వెళ్లిన ఈ బృందంలోని మరో స్కీయర్​ కూడా మృతి చెందినట్లు ఓ వార్త పత్రిక వెల్లడించింది.

kyle smaine
kyle smaine
author img

By

Published : Jan 31, 2023, 1:20 PM IST

Updated : Jan 31, 2023, 2:15 PM IST

జపాన్​లోని మంచు పర్వతాల్లో యాడ్​ షూట్​ కోసం వెళ్లిన ఓ బృందం అక్కడి హిమపాతంలో కూరుకుపోయారు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఆస్ట్రియన్​కు చెందిన ఓ స్కీయర్​తో పాటు అమెరికాకు చెందిన మాజీ వరల్డ్‌ ఛాంపియన్‌ స్కీయింగ్‌ స్టార్‌ కైల్‌ స్మెయిన్‌ మరణ వార్త విన్న యావత్​ క్రీడా ప్రపంచం షాక్​కు గురయ్యింది. జనవరి 29న జపాన్‌లోని నాగానో ప్రిఫెక్చర్‌లోని 2,469 మీటర్ల ఎత్తులో ఉన్న మౌంట్ హకుబా నోరికురాకు వెళ్లిన టీమ్​..షూటింగ్‌ ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు మౌంటెన్‌గెజిట్‌ ఫోటోగ్రాఫర్‌ గ్రాంట్‌ గండర్సన్‌ తెలిపాడు. ప్రమాదం జరిగిన తర్వాత వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఎటువంటి ఫలితం లేకుండా పోయిందని టీమ్​ తెలిపింది.

అయితే స్మెయిన్‌ చనిపోవడానికి ముందు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరలవుతోంది.''పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నప్పటికి స్కీయింగ్‌పై నాకున్న అభిమానం ఎంత కష్టమున్నా లెక్కచేయనివ్వదు. కష్టంలోనే మన సక్సెస్‌ ఏంటో తెలుస్తుంది'' అని పేర్కొన్నాడు. ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్​ తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. కాగా 1991, జూన్‌ 27న అమెరికాలో జన్మించిన కైల్‌ స్మెయిన్‌.. చిన్నప్పటి నుంచే కొండలు, గుట్టలపై క్లైంబింగ్‌ చేయడం చాలా ఇష్టం. ఆ ఇష్టాన్నే హాబీగా మార్చుకున్న స్మెయిన్​.. ఆ తర్వాత స్కీయర్‌గా మారాడు. 2015లో ఎఫ్‌ఐఎస్‌ ఆల్పైన్‌ వరల్డ్‌ స్కై ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని స్వర్ణం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత 2018 ఒలింపిక్స్‌లో స్కీయింగ్‌లో పాల్గొన్న తొలి అమెరికన్‌ అథ్లెట్‌గా కైల్‌ స్మెయిన్‌ ఘనత సాధించాడు.

Last Updated : Jan 31, 2023, 2:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.