All England Open: ఆల్ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ కెరటం లక్ష్యసేన్‌కు నిరాశే ఎదురైంది. ఫైనల్లో ప్రపంచనంబర్ వన్ అక్సెల్సెన్ చేతిలో 21-10, 21-15 తేడాతో ఓటమి పాలయ్యాడు. రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.
మెన్స్ సింగిల్స్ రెండో రౌండ్‌లో ప్రపంచ నంబర్ 3 ర్యాంకర్‌ను ఓడించి మరీ క్వార్టర్స్‌కు వచ్చిన లక్ష్యసేన్‌కు అదృష్టం కలిసొచ్చింది. క్వార్టర్స్‌లో చైనా ఆటగాడు జువాంగ్ జు తప్పుకోవడం (వాకోవర్) వల్ల లక్ష్యసేన్ సెమీస్‌కు చేరుకున్నాడు. సెమీఫైనల్లో గొప్ప పోరాటంతో డిఫెండింగ్ ఛాంపియన్, మలేసియాకు చెందిన లీ జియాపై విజయం సాధించి టైటిల్‌పై ఆశలు రేపిన అతడు తుది సమరంలో తడబడ్డాడు.
ఈ ఏడాది జనవరిలో జరిగిన ఇండియా ఓపెన్ సూపర్ 500 టైటిల్‌ను గెలుచుకున్న లక్ష్యసేన్ అప్పటి నుంచి మంచి ఫామ్‌లో ఉన్నాడు. గత వారం జరిగిన జర్మన్ ఓపెన్‌లో అతడు రన్నరప్‌గా నిలిచాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకం సాధించాడు.
ఇదీ చదవండి: భారత్-లంక పింక్ బాల్ టెస్టు.. పిచ్‌కు దారుణమైన రేటింగ్!