ETV Bharat / sports

Aditi swami archery : అదితి అదరహో.. 17 ఏళ్లకే సీనియర్‌ ప్రపంచ ఛాంపియన్​గా..

Aditi swami archery : భారత యువ ఆర్చర్‌ అదితి స్వామి అదరగొట్టింది. 17 ఏళ్లకే సీనియర్‌ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. ఆ వివరాలు..

Archer aditi
Aditi swami archery : అదితి అదరహో.. 17 ఏళ్లకే సీనియర్‌ ప్రపంచ ఛాంపియన్​గా..
author img

By

Published : Aug 5, 2023, 7:27 PM IST

Updated : Aug 5, 2023, 7:53 PM IST

Aditi swami archery : భారత యువ ఆర్చర్‌ అదితి స్వామి తన సత్తా ఏంటో చూపించింది. 17 ఏళ్లకే సీనియర్‌ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. మొదటిసారి సీనియర్‌ ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌ బరిలోకి దిగిన ఈ పాప.. ఈ ఘనతను దక్కించుకుంది. బెర్లిన్‌ వేదికగా శనివారం జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ మహిళల వ్యక్తిగత కాంపౌండ్‌ ఫైనల్​లో .. మెక్సికోకు చెందిన ఆండ్రియా బెకెర్రాపై ఆమె గెలిచింది. ఫలితంగా గోల్డ్​ మెడల్​ను ముద్దాడింది.

World archery championships 2023 : అంతకుముందు సెమీఫైనల్‌లో అదితి మంచి ప్రదర్శన చేసింది. ఈ పోరులో తన మెంటార్​, భారత సీనియర్‌ ఆర్చర్‌ వెన్నెం జ్యోతి సురేఖను ఓడించింది. తద్వారా ఈమె ఫైనల్‌కు అర్హత సాధించింది. సెమీస్‌లో ఓడిపోయిన జ్యోతి సురేఖ.. మూడో స్థానం కోసం జరిగిన ప్లే ఆఫ్‌లో విజయం సాధించింది సిల్వర్​ మెడల్​ను అందుకుంది.

మహారాష్ట్రలోని సతారాకు చెందిన అమ్మాయి అదితి. ఈ ఏడాది మొత్తంగా ఈమె సూపర్‌ ఫామ్‌లో జోరు కొనసాసించింది. నెల రోజుల క్రితం మహిళల వ్యక్తిగత కాంపౌండ్‌లో అండర్‌-18 ప్రపంచ రికార్డును బ్రేక్ చేసింది.

జులైలో జరిగిన ప్రపంచ యూత్‌ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లోనూ టీమ్‌, వ్యక్తిగత విభాగాల్లో రెండు గోల్డ్ మెడల్స్​ను ముద్దాడింది. ఆ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన మొదటి కాంపౌండ్‌ ఆర్చర్‌ ఈమెనే కావడం విశేషం. ఇప్పుడు సీనియర్‌ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది.

ఇకపోతే శుక్రవారం జరిగిన వరల్డ్​ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌ కాంపౌండ్‌ ఉమెన్స్​ టీమ్​ విభాగంలో భారత్‌.. మొదటి గోల్డ్ మెడల్​ను అందుకున్న సంగతి తెలిసిందే. ఈ పోటీల్లో జ్యోతి సురేఖ నేతృత్వం వహించిన టీమ్ పాల్గొంది. ఇందులో​ అదితి కూడా ఉంది. వరల్డ్​ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో ఏ విభాగంలోనైనా దేశానికి ఇదే తొలి గోల్డ్ కావడం విశేషం. ఇప్పుడు తాజాగా వ్యక్తిగత విభాగంలోనూ అదితి అద్భుతంగా రాణించడం వల్ల భారత్‌ ఖాతాలో మరో గోల్డ్​ మెడల్ వచ్చి చేరింది.

Australia Open Super 500 : ఫైనల్స్​కు ప్రణయ్​.. ఆ భారత షట్లర్​ను ఓడించి..

Ind vs Wi T20 : రెండో టీ20కి టీమ్ఇండియా రె'ఢీ'.. వారిపై వేటు తప్పదా?

Last Updated : Aug 5, 2023, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.