ETV Bharat / sports

బామ్మా బామ్మా బంగారు.. 94ఏళ్ల వయసులో 'స్వర్ణ' రికార్డు.. - పరుగు పందెంలో 94ఏళ్ల బామ్మ రికార్డు

94 years old lady wins gold medal: కొంతమందిని చూస్తే వీళ్లు వయసుకు ఎదురీదుతున్నారేమో అనిపిస్తుంది. అలాంటి వారే 94 ఏళ్ల ఈ బామ్మ. కారణం.. ఈ వయసులో అంతర్జాతీయ పరుగు పందెం పోటీల్లో పాల్గొని బంగారు పతకాన్ని సాధించింది. దీంతోపాటే షాట్​పుట్​లోనూ పాల్గొని కాంస్యాన్ని అందుకుంది. ఆమె ఎవరంటే..

94 years old lady wins gold medal
94 years old lady wins gold medal
author img

By

Published : Jul 11, 2022, 3:19 PM IST

94 years old lady wins gold medal: ఏదైనా సాధించాలనుకుంటే.. వయసుతో సంబంధం లేదని నిరూపించింది ఈ 94ఏళ్ల బామ్మ. సాధారణంగా పురుషులకైనా.. మహిళలకైనా 60 ఏళ్లు పైబడితే అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఇక 90 సంవత్సరాల గలవారైతే.. వారి శరీరంలో శక్తి పూర్తిగా సన్నగిల్లి.. నిలబడలేక, కూర్చోలేక ఏ వస్తువునూ పట్టుకోలేక నానా అవస్థలు పడుతుంటారు. కానీ ఈ బామ్మ మాత్రం 'వయసు సంఖ్య మాత్రమే' అని అంటోంది. 94 ఏళ్ల వయసులో పరుగు పందెంలో పాల్గొని బంగారు పతకం సాధించింది. ఈ విజయంతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది.

ఫిన్​లాండ్​ వేదికగా జూన్​ 29 నుంచి జులై 10వరకు జరిగిన వరల్డ్​ మాస్టర్స్​ అథ్లెటిక్స్​ ఔట్​డోర్​ ఛాంపియన్​షిప్స్​ ఘనంగా ముగిశాయి. ఇందులో భారత్​కు చెందిన 94ఏళ్ల భగ్వానీ దేవీ దాగర్​ అదరగొట్టింది. 100మీటర్ల పరుగు పందెంలో పాల్గొని లక్ష్యాన్ని 24.74 సెకన్లలో ముగించి బంగారు పతకాన్ని సాధించింది. అంతేకాకుండా షాట్​పుట్​లోనూ పాల్గొని తన సత్తా చాటింది. బ్రాంజ్​ మెడల్​ను దక్కించుకుంది.

అంతకుముందు ఈ వరల్డ్ మాస్టర్స్​ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్స్​కు అర్హత సాధించేందుకు చెన్నై వేదికగా జరిగిన నేషనల్​ మాస్టర్స్​ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్స్​లో పాల్గొని మూడు స్వర్ణాలు సాధించి రికార్డుకెక్కింది. ఈమెకు పారా అథ్లెట్​, రాజీవ్​ గాంధీ ఖేల్​ రత్న అవార్డు గ్రహీత వికాస్​ దాగర్​ మనవడు అవుతాడు.

ఇదీ చూడండి: మీకు క్రికెట్‌లో కొత్త రూల్స్‌ తెలుసా...? అక్టోబర్‌ నుంచే అమలు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.