ETV Bharat / sports

తొలి టీ20లో భారత్​పై సౌతాఫ్రికా విజయం.. ఆ రికార్డులకు బ్రేక్​!

author img

By

Published : Jun 9, 2022, 10:35 PM IST

Updated : Jun 10, 2022, 6:49 AM IST

IND Vs SA: బ్యాటుతో ఎంత మెరిసిందో.. బంతితో అంత తేలిపోయింది. పరాభవంతో సిరీస్‌ను మొదలెట్టింది టీమ్​ఇండియా. ఇషాన్‌ కిషన్‌, పంత్‌, హార్దిక్‌ విధ్వంసం కొండంత స్కోరు అందించినా ఏం లాభం! ప్రత్యర్థి అంతకన్నా నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడింది. కాస్తయినా ఒత్తిడి తేలేకపోయిన పసలేని భారత బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ డసెన్‌, మిల్లర్‌ రెచ్చిపోవడంతో తొలి టీ20లో దక్షిణాఫ్రికాదే పైచేయి అయింది. 212 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించేసింది. సఫారీ జట్టుకు టీ20ల్లో ఇదే అత్యధిక ఛేదన. ఈ ఓటమితో భారత్‌ జట్టు 12 మ్యాచ్‌ల విజయపరంపరకు తెరపడింది. దీంతో పాటు ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఆసక్తికర విశేషాలు మీ కోసం..

1ST T20I
దక్షిణాఫ్రికా

IND Vs SA: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను టీమ్‌ఇండియా ఓటమితో మొదలెట్టింది. బ్యాటింగ్‌లో చెలరేగినా.. బౌలింగ్‌లో ప్రత్యర్థిని కట్టడి చేయలేక పరాజయం మూటగట్టుకుంది. గురువారం తొలి టీ20లో జట్టు 7 వికెట్ల తేడాతో ఓడింది. మొదట భారత్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 211 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ (76; 48 బంతుల్లో 11×4, 3×6) అర్ధశతకంతో చెలరేగాడు. శ్రేయస్‌ (36; 27 బంతుల్లో 1×4, 3×6), పంత్‌ (29; 16 బంతుల్లో 2×4, 2×6), హార్దిక్‌ పాండ్య (31 నాటౌట్‌; 12 బంతుల్లో 2×4, 3×6) కూడా మెరిశారు. ఛేదనలో దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. వాండర్‌ డసెన్‌ (75 నాటౌట్‌; 46 బంతుల్లో 7×4, 5×6), 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' మిల్లర్‌ (64 నాటౌట్‌; 31 బంతుల్లో 4×4, 5×6) నాలుగో వికెట్‌కు అజేయంగా 131 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. రెండో టీ20 ఆదివారం కటక్‌లో జరుగుతుంది.

సూపర్‌ జోడీ.. ఛేదనను దక్షిణాఫ్రికా ధాటిగా ఆరంభించింది. ఓ వైపు వికెట్లు పడ్డా.. మరోవైపు పరుగులు రాబట్టింది. బవుమా (10)ను త్వరగానే వెనక్కిపంపిన భువీ (1/43) ప్రత్యర్థికి షాకిచ్చాడు. కానీ ప్రిటోరియస్‌ (29) వస్తూనే విరుచుకుపడ్డాడు. హార్దిక్‌ (0/18) ఓవర్లో మూడు సిక్సర్లు బాదాడు. దీంతో 5 ఓవర్లలోనే స్కోరు 60కి చేరింది. కానీ హర్షల్‌ (1/43)కు పంత్‌ బంతి అందించడం కలిసొచ్చింది. ప్రిటోరియస్‌ను ఓ స్లో ఫుల్‌టాస్‌తో అతను తెలివిగా బోల్తా కొట్టించాడు. గేరు మార్చే సమయంలో డికాక్‌ (22)ను అక్షర్‌ (1/40) ఔట్‌ చేశాడు. 10 ఓవర్లకు స్కోరు 86/3. సాధించాల్సిన రన్‌రేట్‌ పెరిగి పోతుండడం.. బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో భారత్‌ పైచేయి సాధించినట్లే కనిపించింది. కానీ ఐపీఎల్‌లో ధనాధన్‌ ఇన్నింగ్స్‌లతో చెలరేగిన మిల్లర్‌ ఇక్కడా అదే దూకుడు కొనసాగించాడు. ఒక్కసారిగా రెచ్చిపోయాడు.

అక్షర్‌ ఓవర్లో వరుసగా ఓ ఫోర్‌, రెండు సిక్సర్లు కొట్టాడు. అప్పటివరకూ పొదుపుగా బౌలింగ్‌ చేసిన భువీని అతను వదల్లేదు. కేవలం 22 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. దక్షిణాఫ్రికా విజయానికి చివరి అయిదు ఓవర్లలో 64 పరుగులు కావాలి. ఆ దశలో డసెన్‌ క్యాచ్‌ను శ్రేయస్‌ వదిలేయడం తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఆ క్యాచ్‌ అందుకుని ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో! అప్పటివరకూ నెమ్మదిగా బ్యాటింగ్‌ చేసిన అతను.. హర్షల్‌ ఓవర్లో మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌ రాబట్టి కథ మార్చేశాడు. దీంతో విజయ సమీకరణం 18 బంతుల్లో 34గా మారింది. భువీ వేసిన 18వ ఓవర్‌ తొలి బంతికే మిల్లర్‌ సిక్సర్‌ కొట్టగా.. చివరి మూడు బంతుల్లో డసెన్‌ 6, 4, 4 సాధించాడు. దీంతో భారత్‌ ఓటమి ఖాయమైంది. చాహల్‌ (0/26) బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌తో డసెన్‌ లాంఛనం పూర్తి చేశాడు.

దంచుడే దంచుడు.. అంతకుముందు బలంగా ఉన్న ప్రత్యర్థి బౌలింగ్‌ దళంపై టీమ్‌ఇండియా బ్యాటర్లు దండయాత్ర చేశారు. ముఖ్యంగా తన సామర్థ్యంపై వస్తున్న అనుమానాలను పటాపంచలు చేస్తూ ఇషాన్‌ రెచ్చిపోయాడు. స్పిన్నర్‌ కేశవ్‌ (1/43) వేసిన తొలి ఓవర్లోనే వరుసగా రెండు ఫోర్లు కొట్టి తన ఉద్దేశాన్ని చాటి చెప్పాడు. కానీ ఆ తర్వాత ఇన్నింగ్స్‌ కాస్త నెమ్మదించింది. 5 ఓవర్లకు స్కోరు 36. కానీ నోకియా (1/36) వేసిన ఆరో ఓవర్‌తో ఇన్నింగ్స్‌ స్వరూపమే మారిపోయింది. ఆ ఓవర్లో రుతురాజ్‌ (23) ఓ సిక్సర్‌, ఇషాన్‌ రెండు ఫోర్లు కొట్టడంతో పవర్‌ప్లే ముగిసే సరికి టీమ్‌ఇండియా 51/0తో నిలిచింది. ఆ వెంటనే రుతురాజ్‌ ఔటైనా.. భారత్‌కు ఇబ్బంది లేకుండా పోయింది. శ్రేయస్‌ (36) జతగా ఇషాన్‌ చెలరేగడమే అందుకు కారణం. సాధారణంగా మధ్య ఓవర్లలో స్కోరు బోర్డు నెమ్మదిస్తుంది. కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం మనవాళ్లు మధ్య ఓవర్లలోనే విధ్వంసం సృష్టించారు..

టీమ్‌ఇండియా తరపున అద్భుత ఫామ్‌లో ఉన్న శ్రేయస్‌ సిక్సర్లతో హడలెత్తించాడు. షంసి (0/27) ఓవర్లో అతను లాంగాన్‌లో కొట్టిన రెండు సిక్సర్లు హైలైట్‌గా నిలిచాయి. దీంతో పదో ఓవర్లలోనే స్కోరు వంద దాటింది. ఆ వెంటనే శ్రేయస్‌ను స్టంపౌట్‌ చేసే అవకాశాన్ని డికాక్‌ వృథా చేశాడు. సిక్సర్‌తో అర్ధశతకం అందుకున్న ఇషాన్‌ ఒక్కసారిగా టాప్‌గేర్‌లోకి వెళ్లిపోయాడు. కేశవ్‌ బౌలింగ్‌లో వరుసగా 6, 6, 4, 4 రాబట్టాడు. కానీ అదే ఓవర్‌ చివరి బంతికి ఔటవడంతో అతని మెరుపులకు తెరపడింది. ఆ వికెట్‌తో ఇన్నింగ్స్‌ లయ తప్పినట్లనిపించింది. కుదురుకునేందుకు పంత్‌ సమయం తీసుకోవడం.. కీలక దశలో శ్రేయస్‌ పెవిలియన్‌ చేరడం ప్రభావం చూపింది. కానీ సరైన వేళలో జూలు విదిల్చిన పంత్‌.. జట్టుకు మళ్లీ వేగాన్ని అందించాడు. ఐపీఎల్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ హార్దిక్‌ కూడా రెచ్చిపోయాడు. చాలా రోజుల తర్వాత భారత్‌ తరపున తన పవర్‌ హిట్టింగ్‌తో మళ్లీ అలరించాడు.

ఆ క్యాచ్‌.. ఆ ఓవర్‌.. క్యాచ్‌లు వదిలితే మ్యాచ్‌లు పోయినట్లేనని అంటారు. తొలి టీ20లో మరోసారి అది నిజమని రుజువైంది. అవేశ్‌ ఖాన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ రెండో బంతిని డసెన్‌ డీప్‌ మిడ్‌వికెట్‌ వైపు గాల్లో ఆడాడు. అక్కడే ఉన్న శ్రేయస్‌ తన చేతుల్లో పడ్డ బంతిని వదిలేశాడు. అప్పటికి డసెన్‌ 30 బంతుల్లో 29 పరుగులే చేశాడు. విజయ సమీకరణం 29 బంతుల్లో 63 పరుగులతో క్లిష్టంగానే ఉంది. ఆ దశలో వికెట్‌ పడి ఉంటే.. ప్రత్యర్థి జట్టు ఒత్తిడికి లోనయ్యేది. కానీ ఆ అవకాశాన్ని శ్రేయస్‌ చేజార్చాడు. జీవదానం పొందిన డసెన్‌ ఆ తర్వాతి ఓవర్‌ నుంచే విధ్వసం సృష్టించాడు. హర్షల్‌ వేసిన 17వ ఓవర్లో మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌ కొట్టి మొత్తం 22 పరుగులు రాబట్టాడు. ఈ ఓవర్‌తోనే మ్యాచ్‌ దక్షిణాఫ్రికా వైపు తిరిగింది. తాను ఆడిన చివరి 16 బంతుల్లో ఏకంగా 46 పరుగులు చేసిన డసెన్‌ జట్టును గెలిపించాడు.

కరోనాతో మార్‌క్రమ్‌ దూరం.. టీమ్‌ఇండియా, దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌ ఆరంభానికి ముందే కరోనా కలవరం మొదలైంది. తొలి మ్యాచ్‌ ప్రారంభం కావడానికి ముందే సఫారీ ఆటగాడు మార్‌క్రమ్‌ పాజిటివ్‌గా తేలాడు. దీంతో అతను ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. భారత్‌ చేరుకున్న తర్వాత ఆటగాళ్లకు చేసిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో మార్‌క్రమ్‌కు నెగెటివ్‌ వచ్చింది. కానీ తాజాగా నిర్వహించిన పరీక్షలో మాత్రం వైరస్‌ సోకినట్లు తేలింది. అతని స్థానంలో 21 ఏళ్ల స్టబ్స్‌ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ ఓటమిపాలైంది. టీమ్‌ఇండియాపై దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని సౌతాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో ఛేదించింది. డేవిడ్‌ మిల్లర్ (64; 31 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), డస్సెన్ (75; 46 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ శతకాలతో చెలరేగి జట్టుకు విజయానందించారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఆసక్తికర విశేషాలు మీ కోసం..

అంతర్జాతీయ టీ20ల్లో దక్షిణాఫ్రికా భారీ ఛేదనలు

  • దిల్లీ వేదికగా జూన్‌ 9న (2022) భారత్‌పై 212 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.
  • 206 వెస్టిండీస్‌పై 2007 జోహన్నస్‌బర్గ్
  • 200 టీమ్‌ఇండియాపై 2005 ధర్మశాల
  • 189 టీమ్‌ఇండియాపై 2018 సెంచురియాన్‌

భారత్‌పై అంతర్జాతీయ టీ20ల్లో భారీ ఛేదనలు

  • 212 సౌతాఫ్రికా దిల్లీ 2022
  • 200 సౌతాఫ్రికా ధర్మశాల 2015
  • 193 వెస్టిండీస్‌ ముంబయి 2018

అంతర్జాతీయ టీ20ల్లో వరుస విజయాలు సాధించిన జట్లు

  • అఫ్గానిస్థాన్‌ 12 విజయాలు (ఫిబ్రవరి 2018 సెప్టెంబరు 2019)
  • రోమేనియా 12 విజయాలు (అక్టోబర్‌ 2020 సెప్టెంబరు 2021)
  • టీమ్‌ఇండియా 12 విజయాలు (నవంబర్‌ 2021 ఫిబ్రవరి 2022)
  • (2022 జూన్ 9న సౌతాఫ్రికా చేతిలో భారత్‌ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లోగానుక విజయం సాధిస్తే టీమ్‌ఇండియా వరుసగా 13 విజయాలతో ప్రపంచ రికార్డు సృష్టించేది.)
  • (అఫ్గానిస్థాన్‌ 11 విజయాలు (మార్చి 2016 మార్చి 2017)
  • (ఉగాండా 11 విజయాలు (సెప్టెంబరు 2021 అక్టోబరు 2021)

అంతర్జాతీయ టీ20ల్లో నాలుగో వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం

  • (161 పరుగులు డేవిడ్ వార్నర్‌, మ్యాక్స్‌వెల్)- సౌతాఫ్రికాపై 2016లో
  • (131*పరుగులు డస్సెన్, డేవిడ్‌ మిల్లర్)- భారత్‌పై 2022లో
  • (127*పరుగులు డుప్లెసిస్‌, డస్సెన్)- ఇంగ్లాండ్‌పై 2020లో

ఇదీ చదవండి: ఇండోనేసియా మాస్టర్స్​ క్వార్టర్స్‌లో సింధు, లక్ష్యసేన్‌

Last Updated : Jun 10, 2022, 6:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.