ETV Bharat / sports

ఒడిశాలో అతిపెద్ద హాకీ స్టేడియం.. ఆ ప్రపంచకప్​ కోసమే

దేశంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. 2023 పురుషుల హాకీ ప్రపంచకప్​ నాటికి దీనిని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తెలిపారు.

India's largest hockey stadium planned in Rourkela, will host 2023 world cup games
ఒడిశాలో అతిపెద్ద హాకీ స్టేడియం.. ప్రపంచకప్​కు సిద్ధం!
author img

By

Published : Dec 24, 2020, 3:35 PM IST

దేశంలోనే అతిపెద్ద హాకీ స్టేడియాన్ని రూర్కెలాలో నిర్మించనున్నట్లు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​ గురువారం మరోసారి చెప్పారు. గతంలో ప్రకటించిన విధంగానే 2023 పురుషులు హాకీ ప్రపంచకప్​ సమయానికి ఈ స్టేడియాన్ని సిద్ధం చేయాలని సంకల్పించినట్లు తెలిపారు.

బిజూ పట్నాయక్​ యూనివర్సిటీ ఆఫ్​ టెక్నాలజీ ఆవరణలోని 15 ఎకరాల్లో, 20 వేలమంది ప్రేక్షకుల సామర్థ్యంతో దీన్ని నిర్మించనున్నట్లు నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. హాకీ ప్రపంచకప్​ను భువనేశ్వర్, రూర్కెలాలో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒడిశా నుంచి దిలీప్​ టిర్కీ, సునీతా లక్రా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

సౌకర్యాల కోసం పరిశీలన

అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్​ఐహెచ్​), ఒడిశా క్రీడాశాఖ అధికారులు ఇప్పటికే రూర్కెలాలో స్టేడియం నిర్మించాలనుకుంటున్న ప్రదేశాన్ని పరిశీలించారు. టోర్నీని నిర్వహించేందుకు అవసరమైన సౌకర్యాలను చూశారు. స్టేడియం నిర్మాణా పనులను ఇప్పటికే ప్రారంభమై, శరవేగంగా సాగుతున్నాయి.

ఇదీ చూడండి: కోహ్లీ కోసం ధోనీ త్యాగం.. మీరే చూడండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.