భారత హాకీ జట్టు వచ్చే ఏడాది జరగనున్న టోక్యో ఒలింపిక్స్‌కు అర్హ త సాధించింది. భువనేశ్వర్ వేదికగా శనివారం జరిగిన ఒలింపిక్స్ క్వాలిఫయర్ రెండో మ్యాచ్‌లో రష్యాను 7-1 తేడాతో ఓడించి ఒలింపిక్స్ బెర్త్ ఖరారు చేసుకుంది భారత్.
మ్యాచ్ ప్రారంభమైన తొలి నిమిషంలోనే రష్యా ఆటగాడు అలెక్సీ గోల్ కొట్టి భారత్‌కు షాక్ ఇచ్చాడు. తొలి క్వార్టర్ ముగిసేసరికి మన్‌ప్రీత్ సేన 0-1తో వెనుకంజలో నిలిచింది. అయితే రెండో క్వార్టర్ ఆరంభమైన కొద్దిసేపటికే హార్దిక్ (17వ నిమిషంలో) గోల్ కొట్టి స్కోరును 1-1తో సమం చేశాడు. ఆ తర్వాత భారత్ వెనుదిరిగి చూడలేదు. 23, 29వ నిమిషంలో అక్షదీప్ సింగ్ వరుస గోల్స్‌తో హోరెత్తించాడు. అర్ధభాగం ముగిసేసరికి భారత్ 3-1తో ఆధిక్యంలో నిలిచింది.
అనంతరం 47వ నిమిషంలో నీలకంఠ శర్మ, 48వ నిమిషంలో రుపిందర్ సింగ్ గోల్స్ కొట్టడంతో భారత్ భారీ ఆధిక్యం సాధించింది. ఆఖర్లో భారత్ మరింత పుంజుకొని రెండు గోల్స్ కొట్టి మ్యాచ్‌ను 7-1 తేడాతో ముగించింది. ఇదే వేదికగా శుక్రవారం జరిగిన క్వాలిఫయర్ మొదటి మ్యాచ్‌లో రష్యాను 4-2 తేడాతో మన్‌ప్రీత్ సేన ఓడించిన సంగతి తెలిసిందే.
మరోవైపు భారత మహిళా హాకీ జట్టు కూడా ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో ఓడినప్పటికీ గోల్స్ లెక్కలో(65) ముందంజలో ఉన్న భారత జట్టు ఒలింపిక్స్ బెర్తు ఖరారు చేసుకుంది.
ఇదీ చదవండి: టోక్యో ఒలింపిక్స్‌కు మహిళా హాకీ జట్టు అర్హత