ETV Bharat / sports

పేదరికం వెనక్కి లాగితే.. పట్టుదల ఒలింపిక్స్‌కు చేర్చింది! - భారత హాకీ మహిళల జట్టు

స్కూల్లో 'చేతిరాత' పోటీలు జరుగుతున్నాయి.. మొదటి బహుమతి గడియారం.. దానికోసం పగలు, రాత్రి రాత సాధన చేసి ఫస్ట్‌ప్రైజ్‌ గెల్చుకుందో అమ్మాయి. 'హమ్మయ్య.. ఇక హాకీ ట్రైనింగ్‌కు లేటవ్వదు. అందులో అలారం ఉంది' అని సంబరపడిన ఆ పిల్లే ఇప్పుడు టోక్యోలో భారత మహిళల హాకీ జట్టు సారథి రాణీ రాంపాల్‌.

Rani Rampal
రాణీ రాంపాల్‌
author img

By

Published : Aug 3, 2021, 8:56 AM IST

ఆడపిల్లంటే కడుపులోనే చంపేద్దాం అనే భావన బలంగా ఉన్న ప్రాంతం హరియాణా. అక్కడి కురుక్షేత్ర జిల్లాలోని షాబాద్‌ గ్రామమే రాణీ సొంతూరు. తండ్రి రిక్షాలాగేవాడు. ఇద్దరు అన్నయ్యలు వదినలు ఉన్న ఆ కుటుంబమంతా ఓ పూరి గుడిసెలో సర్దుకొనేవారు. ఆరేళ్ల వయసులో 'నేనూ హాకీ ఆడతా నాన్నా' అని ఆమె అన్నప్పుడు అమ్మానాన్నలు ఉలిక్కిపడ్డారు. అవును మరి.. రోజంతా రిక్షా నడిపితే వచ్చే పదీపరకా ఆదాయంతో ఆ పిల్లని బడికి పంపడమే గొప్ప. ఇక ఆటలూ.. పాటలూనా? అందుకే కరాఖండీగా వద్దనే చెప్పింది అమ్మ. ఆ అమ్మాయి అంతకంటే మొండిది. అన్నం తినకుండా ఏడుపులు, వేడుకోళ్లతో రోజూ సతాయించేది. స్కూల్‌కెళ్లి అక్కడి దగ్గర్లోని షాబాద్‌ హాకీ అకాడమీ కోచ్‌ బలదేవ్‌సింగ్‌నీ బతిమాలేది. చిన్న పిల్ల అని ఆ కోచ్‌ పట్టించుకోలేదు. ఎలా అయితేనేం మొదట నాన్నని ఒప్పించింది. కోచ్‌ మాత్రం ససేమిరా అన్నాడు. సన్నగా ఉందని వద్దంటున్నాడేమో అనుకున్నారు. కాదు.. అసలే పేదవాళ్లు. ఈ ఆటకూడా తోడై వాళ్ల జీవితం భారంగా మారకూడదనేది ఆయన ఆలోచన. కానీ రాంపాల్‌ వింటేనా? కాళ్లావేళ్లా పడ్డాడు. వాళ్ల తపనని గమనించిన కోచ్‌ బలదేవ్‌సింగ్‌ రాణీని శిష్యురాలిగా స్వీకరించాడు. అలా ఆరేళ్ల వయసులో అకాడమీలో అడుగుపెట్టింది రాణీ. రామ్‌పాల్‌కి మంచి హాకీ కిట్‌ కొనిచ్చే శక్తి కూడా లేదు. పేదరికం ఎన్నోసార్లు రాణీని వెనక్కిలాగినా.. కోచ్‌ అండగా నిలిచాడు. సీనియర్లు పాత హాకీ కిట్‌లు ఇచ్చి ఆమెను ముందుకు నడిపించారు.

Rani Rampal
భారత మహిళల హాకీ జట్టు సారథి రాణీ రాంపాల్‌

కోచ్‌ బలదేవ్‌సింగ్‌ ఎంత ప్రేమగా ఉంటాడో అంత కఠినంగా కూడా ఉండేవాడు. అకాడమీకి రావడం రెండు నిమిషాలు లేట్‌ అయినా రెండొందల ఫైన్‌. వంద తీసుకురావడమే రాణీకి చాలా కష్టమయ్యేది. ఆ వందకి తనే మరో వంద వేసి ఇచ్చి 'లేట్‌గా రావొద్దు' అంటూ ప్రేమగా కసురుకొనేవాడు బలరామ్‌సింగ్‌. తనకీ లేట్‌గా రావడం ఇష్టం లేదు. రాణీ వాళ్ల అమ్మ సరిగా నిద్రపోకుండా కునికిపాట్లు పడుతూ మేలుకొని కూతురిని అకాడమీకి పంపేది. ఒక రోజు స్కూల్లో చేతిరాత పోటీలు జరుగుతున్నాయి. ఇందులో గెలిస్తే గడియారం ఇస్తారని తెలిసి రాణీ తన రాతను సరిచేసుకుని మొదటి ప్రైజు గెల్చుకుని అమ్మకు కానుకగా ఇచ్చింది. బంధువులు మాత్రం 'పొట్టిబట్టలతో.. మగాడిలా ఏంటా తిరుగుళ్లు' అంటూ ఈసడించేవాళ్లు. ఇన్ని కష్టాలు, విమర్శల మధ్య కూడా రాణీ సాధనని నిర్లక్ష్యం చేయలేదు. ఆ పట్టుదలే తనకి 14 ఏళ్ల వయసులోనే జాతీయ జట్టులో స్థానాన్ని కల్పించింది. అప్పటి నుంచీ తన లక్ష్యం ఒలింపిక్స్‌ పతకమే. టీం కెప్టెన్‌గా ఎదిగి ఎన్నో విజయాలు సాధించినా 2007 రాణీకి గడ్డురోజులనే చెప్పాలి. వెన్నెముక గాయం కారణంగా హాకీ స్టిక్‌ని పట్టుకోవడం కష్టమనే అన్నారంతా. కానీ అమ్మానాన్నల కష్టం వృథా పోకూడదనే పట్టుదలతో కఠోర సాధన చేసింది. తిరిగి మైదానంలో అడుగుపెట్టింది. కూల్‌ కెప్టెన్‌గా పేరుతెచ్చుకుంది. 'నాకు మంచి బట్టలు ఉండేవి కావు. ఇవాళ అంతర్జాతీయ బ్రాండ్‌లు కోరిన దుస్తుల్ని అందిస్తున్నాయి. మా అమ్మానాన్నల కోసమే ఇదంతా సాధించాను' అనే రాణీ ప్రస్తుతం ఎమ్మే ఇంగ్లిష్‌ చదువుతోంది. 'మరొకరికి స్ఫూర్తిగా ఉండటమంటే నాకిష్టం. నన్ను తిట్టిన బంధువులే ఇప్పుడు మా పిల్లలకు హాకీ నేర్పిస్తావా అంటున్నారు. నా గ్రామంలో ఆడపిల్లల కోసం ఒక హాకీ అకాడమీ నిర్మించాలనేది నా కల'అనే రాణీ అర్జున, పద్మశ్రీ, ఖేల్‌రత్న అవార్డులని అందుకుంది.

Rani Rampal
రాణీ రాంపాల్‌

"ఫిట్‌నెస్‌ అంటే ప్రాణం. కానీ ఇంటికెళ్తే అమ్మ వండినవన్నీ తినిపెడతా. అమ్మని బాధపెట్టడం నాకిష్టం లేదు. మళ్లీ ఆ బరువు తగ్గడానికి చాలా కష్టపడాలి.. అది వేరే విషయం అనుకోండి" అని చెప్పుకొచ్చింది రాణి.

Rani Rampal
టోక్యోలో రాణి

ఇదీ చూడండి: దుమ్మురేపిన మహిళల హాకీ జట్టు.. క్వార్టర్స్​లో విజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.